ఈ ఏడాది దీపావళి వేడుకలు తగ్గాయట

దేశ వ్యాప్తంగా నిన్న దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.అడుక్కునే వారి నుండి అంబానీ వరకు అంతా కూడా తమ హోదాకు తగ్గట్లుగా దీపావళి పండుగను జరుపుకున్నారు.

 Corporate Merchants Comments On This Year Diwali Celabrations-TeluguStop.com

అయితే ఈసారి ఆసక్తికర విషయం ఏంటీ అంటే గతంతో పోల్చితే ఈసారి దీపావళి వేడుకల్లో ఒక లోటు కనిపిస్తుంది.అదేంటి అంటే దీపావళి టపాసుల సందడి.

ఔను పర్యావరణ కాలుష్యం అంటూ చాలా మంది దీపావళి క్రాకర్స్‌కు గుడ్‌ బై చెప్పారు.పలు కార్పోరేట్‌ సంస్థలు మరియు ప్రముఖులు పర్యావరణంకు హానీ అంటూ క్రాకకర్స్‌ను కాల్చకుండా ఉన్నారు.

సెలబ్రెటీలు ముఖ్యంగా క్రాకర్స్‌కు దూరంగా ఉన్నారు.లక్షలు ఖర్చు చేసి సెలబ్రెటీలు క్రాకర్స్‌ కాల్చేవారు.కాని ఈసారి మాత్రం చాలా మంది గిఫ్ట్‌లు స్వీట్‌ బాక్స్‌లను ఇచ్చి పండుగ జరుపుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రముఖులు చాలా మంది గట్టిగా శబ్దం వచ్చే బాంబులను కాల్చక పోవడంతో పాటు, వాతావరణం కాలుష్యం అయ్యే పొగను వదిలే బాంబులను కూడా కాల్చలేదు.

అందుకే గతంతో పోల్చితే ఈసారి క్రాకర్స్‌ అమ్మకాలు తక్కువగా ఉన్నాయంటూ వ్యాపారలు చెబుతున్నారు.దాదాపుగా 20 శాతం క్రాకర్స్‌ అమ్మకాలు తగ్గాయనేది వారు చెబుతున్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube