వూహన్ లో మళ్లీ కవ్విస్తున్న కరోనా, కీలక నిర్ణయం

నోవెల్ క‌రోనా వైర‌స్‌కు చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర‌బిందువైన విష‌యం తెలిసిందే.76 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత ఆ నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఇటీవ‌లే లాక్ డౌన్ ను ఎత్తేసి సాధారణ జీవితం గడుపుతున్నారు.అయితే అక్కడ ఇక కరోనా తుడిచిపెట్టుకుపోయింది అని అనుకుంటున్నా సమయంలో గ‌త రెండు రోజుల నుంచి కొత్త పాజిటివ్ కేసులు బ‌య‌ప‌టుడుతున్నాయి.దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 Wuhan To Test Whole City Of 11 Million As New Cases Emerge Chaina , Coronavirus-TeluguStop.com

నగరంలో కేసులు మరింత పెరగకముందే ఆ న‌గ‌ర అధికారులు ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.వుహాన్ న‌గ‌రంలో ఉన్న కోటి ప‌ది ల‌క్ష‌ల మంది జ‌నాభాకు క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టాల‌న్న కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీని కోసం న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ప‌ది రోజుల్లో మొత్తం జ‌నాభాకు ప‌రీక్ష చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల‌తో పాటు వైర‌స్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రీక్ష‌లు ముమ్మ‌రం చేయాల‌ని భావిస్తున్నారు.వుహాన్‌లో ఏప్రిల్ 8వ తేదీన లాక్‌డౌన్ ఎత్తివేశారు.

లాక్ డౌన్ ఎత్తేసిన నెల రోజుల తరువాత అంటే మే 10, 11 తేదీల్లో కొత్తగా ఆరు కేసులు న‌మోదు అవ్వడం తో అక్కడి అధికారులు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.క్వారెంటైన్‌లో ఉన్న‌వారికి వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డినాయి.

అది కూడా వారంతా ఒకే అపార్ట్‌మెంట్ కావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube