కాటికి మోసే ఆ నలుగురికి చోటు లేదు… జేసీబీతో స్మశానానికి  

Coronavirus Victim Transport In Jcb At Palasa - Telugu Chandrababu, Corona Effect, Corona Virus,, Covid-19, Srikakulam

కరోనా వైరస్ ప్రభావం మనిషికి మనిషికి మద్యం భౌతిక దూరం పెంచేసింది.కుటుంబ సభ్యుల మధ్య అయిన కూడా కరోనా వస్తే కచ్చితంగా అంటరానివారిగా బ్రతకాల్సిందే.

 Coronavirus Victim Transport In Jcb At Palasa

కనీసం కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు కుటుంబ సభ్యులని కూడా పేషెంట్ ని చూడటానికి అనుమతించరు.ఇక ఆ కరోనా రోగి చనిపోతే అతని దహనం సంస్కారాలకి సంప్రదాయాలతో సంబద్ధం ఉండదు.

ఏదో వ్యాన్ లోనో లేక, ఇతర వాహనాల ద్వారానో, పూర్తిగా ప్లాస్టిక్ కవర్లలో చుట్టేసి స్మశానంలో ఖననం చేస్తారు.చివరి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా అయిపొయింది.

కాటికి మోసే ఆ నలుగురికి చోటు లేదు… జేసీబీతో స్మశానానికి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు అలాంటి దుస్థితి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక వృద్ధుడికి వచ్చింది.

ఉదయపురం గ్రామంలో ఓ వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందాడు.

అతడిని కుటుంబ సభ్యులు స్మశానంకి తరలించే సమయంలో కలెక్టర్ తో సహా అధికారులు అక్కడికి చేరుకొని వారిని నియంత్రించి చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు చేయించారు.వాటిలో వృద్ధుడుకి కరోనా ఉందని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులని క్వారంటైన్ చేసి వారికి పరీక్షలు నిర్వహించారు.

అలాగే వారితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు.ఆ ప్రాంతాన్ని కంటైన్మేంట్ జోన్ గా చేసేసారు.ఇక చనిపోయిన వృద్ధుడు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లుతో చుట్టి జేసీబీ తొట్టెలో వేసి స్మశానంకి తరలించి ఖననం చేశారు.ఆ వృద్ధుడి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి కుటుంబ సభ్యులకి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియోని చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ విమర్శలు చేశారు.అయితే నెటిజన్లు మాత్రం వారి మీద రివర్స్ ఎటాక్ చేసారు.

కరోనాతో చనిపోయిన వారిని అలా కాకుంటే వందలాది మంది వెళ్లి సంతాపం తెలిపి మోసుకొని వెళ్ళాలా, వారందరికీ కరోనా వస్తే మీరు బాధ్యులు అవుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test