కేవలం రూ. 2500 ఇస్తే చాలు కరోనా నెగిటివ్ వచ్చేస్తుంది....!

కరోనా మహమ్మారి పేరు వినగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా హడలిపోయే పరిస్థితి నెలకొంది.ఈ కరోనా ఏ ముహూర్తంలో మొదలైందో గానీ వేరే ఇతర ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆసుపత్రికి వెళ్లడానికి భయపడిపోతున్నారు.

 Private Hospital Giving Corona Negative Report In Uttar Pradesh, Coronavirus, Ut-TeluguStop.com

ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి నుంచి కరోనా అంటుకుంటుందో అన్న టెన్షన్ అందరిలోనూ పెరిగిపోయింది.ఒకవేళ ఖర్మ కాలి కరోనా వచ్చిందో ఇక అంతే సంగతులు ఆసుపత్రి నుంచి బయటకు రావాలి అంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే.

దీనితో ఈ వైరస్ బారిన పడినా కూడా ఎవరూ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడానికి సిద్ధపడడం లేదు సరికదా కొందరు పారిపోతున్నారు కూడా.

అయితే ఒకవేళ మన ఒంట్లో కరోనా ఉన్నప్పటికీ కూడా బయటకు తెలియకుండా కప్పిపుచ్చడం కోసం కూడా కొన్ని ఆసుపత్రులు ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు కరోనా అంటే ఏ రేంజ్ లో జనాలు భయపడుతున్నారు.కరోనా టెస్ట్ చేయించుకొని పాజిటివ్ వస్తే దానికి లక్షల్లో ఖర్చు పెట్టడం కన్నా డాక్టర్ కు రూ.2500 ఇస్తే వెంటనే కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చేస్తారట.ఇంతకీ ఈ ఆసుపత్రి ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.యూపీ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇలాంటి బేరాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.

కేవలం రూ.2500 చెల్లిస్తే చాలు నెగిటివ్ అని రిపోర్టు ఇస్తామని ఓ ఆస్పత్రి నిర్వాహకుడు బేరమాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.యూపీలో ఇది జరగడంతో ఆస్పత్రిపై అధికారులు చర్యలు చేపట్టారు.మీరట్‌కు చెందిన ఓ ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది.డబ్బులు ఇస్తే కరోనా లేదని రిపోర్టు ఇస్తామని చెబుతూ.ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా తీసిన వీడియో బయటకు వచ్చింది.

విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆ ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా ఆ ఆసుపత్రికి సీల్ వేసి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి పనులు చేయడంపై సీరియస్ అయిన అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.

డబ్బు సంపాధించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.అంతేకాకుండా ఇలాంటి ముఠాలపై నిఘా కూడా పెంచామని అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube