ఇకనైనా మారండి : ఈ గిరిజనులను చూసైనా బుద్ది తెచ్చుకోండ్రా బాబు, కరోనాను వ్యాప్తి చెందించకండ్రా బాబు

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నారు.అయినా కూడా జాగ్రత్తలు పాటించకుండా కరోనాను అంటించుకుంటున్నారు.

 Coronavirus Tribes Facemask-TeluguStop.com

వారు అంటించుకుంటే వారి పాపన వారు పోతారు.కాని వారు అంటించుకోవడమే కాకుండా రాష్ట్రాలకు ఇంకా దేశాలకు కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారు.

ఒక వైపు మరణ మృదంగం మ్రోగుతూనే ఉన్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంటుంది.

బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలి.లేదంటే ప్రమాదం మీకు తెలియకుండానే మీకు చుట్టుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం మాస్క్‌ల కొరత ఏర్పడినది.దాంతో మాస్క్‌లు సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకునే పద్దతులు వచ్చాయి.

లేదంటే కనీసం కర్ఛీఫ్‌ అయినా మూతికి కట్టుకోవాలంటూ ప్రభుత్వ వర్గాల వారు సూచిస్తున్నారు.అయినా కూడా ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు.

Telugu Coronavirus, Facemask, Tribes-Latest News - Telugu

ఇలాంటి సమయంలో ఏమాత్రం ఎడ్యుకేటెడ్‌ కాని ఛత్తీస్‌గడ్‌ రాష్ట్ర గిరిజన ప్రాంత ప్రజలు కరోనా వ్యాప్తి నుండి జాగ్రత్తగా ఉండేందుకు మాస్క్‌లు వాడుతున్నారు.వారు ఆ మాస్క్‌లను తాటి ఆకులతో చేయించుకుని మరీ వాడుతున్నారు.అవి కాస్త కఠినంగా ఉన్నా కూడా వాటినే వాడుతున్నారు.జనాలు సామాజిక దూరంను కూడా మెయింటెన్‌ చేస్తూ వస్తున్నారు.
గిరిజనులు పాటిస్తున్న జాగ్రత్తలు అయినా మనం పాటించాలి.లేదంటే చదువుకుని వృదా అంటూ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై అయినా మారి ఇంటికే పరిమితం అవుదాం.తప్పనిసరి అయితే అత్యంత జాగ్రత్తలు తీసుకుని మరీ బయటకు వెళ్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube