ఒకప్పుడు అలా చేస్తే వేటు పడేది,కానీ ఇప్పుడు

క్రికెట్ పేరు చెప్పగానే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు.అయితే ఈ క్రికెట్ లో భాగంగా ఆటగాళ్లు బౌలింగ్ చేసేటప్పుడు ఒక్కసారి బాల్ టాంపరింగ్ కి పాల్పడుతుండే వారు.

 Icc To Legalize Ball-tampering In International Cricket , Coronavirus, Test Cric-TeluguStop.com

ఈ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగానే గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్,స్టీవ్ స్మిత్,బాన్ క్రాఫ్ట్ లు ఏడాదిపాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే.సాధారణంగా బంతి మెరుపు కోసం క్రికెటర్లు అప్పుడప్పుడూ ఉమ్మిని పూస్తుంటారు.

ముఖ్యంగా టెస్టుల్లో స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా చేస్తారు.అయితే ఇలా చేసే క్రమంలో కొంతమంది ఉమ్మిని కాకుండా కృత్తిమ పదార్ధాలు,ఇతర వస్తువులను ఉపయోగించి బాల్ టాంపరింగ్ కు పాల్పడుతుంటారు.

ఇలాంటి వారిపై వేటు వేయడం వంటి చర్యలు తీసుకుంటుంది ఐసీసీ.అయితే తాజాగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండం తో ఇలా ఉమ్మివేసి బాల్ మెరుపుకోసం ప్రయత్నించడం వంటివి చేయడం ప్రమాదకరమని ఇలా చేయడం వల్ల ముప్పు పొంచి ఉంటుంది అని ఐసీసీ మెడికల్ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

దీనితో అంతర్జాతీయ క్రికెట్‌లో మున్ముందు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఐసీసీ భావిస్తోంది.అందులో భాగంగానే ఇకపై బంతి మెరుపు కోసం ఉమ్మిని కాకుండా ఆమోదయోగ్యమైన కృత్రిమ పదార్థాలు, ఇతర వస్తువులను అనుమతించాలని.

అది కూడా అంపైర్ల సమక్షంలోనే చేసేలా కొత్త రూల్‌ను తీసుకురావాలని భావిస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube