తెలంగాణ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు,డాక్టర్ మృతి!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోని తెలంగాణా లో కూడా ఉగ్రరూపం దాల్చుతుంది.రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు.

 Corona Kills Doctor In Hyderabad Telangana, Coronavirus, Telangana, Doctors, Hyd-TeluguStop.com

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా తెలంగాణా లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.లాక్ డౌన్ సడలింపులు తరువాతే కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

మరోపక్క కరోనా వైరస్‌పై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిని కరోనా వైరస్ వెంటాడుతోంది.

వారు సైతం కరోనా బారిన పడుతుండడం.

పెద్ద తలనొప్పిగా మారింది.హైదరాబాద్ మహానగరంలోని పలు ఆస్పత్రులకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడగా,తాజాగా ఓ వైద్యుడు(70) కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వైద్యుడు వారం రోజుల క్రితం జ్వరంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా, చికిత్సలో భాగంగా అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడం తో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మరణించాడు.ఆయనకు కరోనా వైరస్ సోకడంతో పాటు బీపీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.

Telugu Corona Peoples, Coronavirus, Doctors, Hyderabad, Kims Hospitals, Telangan

ఇదిలావుంటే.సదరు వైద్యుడు ఇటీవల కరోనా బాధితులకు చికిత్స అందించలేదని, లాక్‌డౌన్ నుంచి తన ఆస్పత్రిని మూసివేశామని వైద్యుడి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.అయితే అసలు ఆయనకు కరోనా ఎలా సోకింది అనేది మాత్రం అర్ధంకావడం లేదు.ఏదిఏమైనా కరోనా వైరస్ సోకి వైద్యులు మరణించడం మాత్రం అందరినీ కలచివేస్తోంది.మరోపక్క దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,13 వేల మందికి పైగా ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

తోలి లక్ష కేసులు నమోదు అవ్వడానికి 111 రోజుల సమయం పట్టగా, కేవలం 8 రోజుల్లోనే లక్ష కేసులు నమోదు అవ్వడం కలవరం కలిగిస్తుంది.రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube