ఛీ.. ఛీ.. చివరకు కరోనా పరీక్షలు చేయించుకోవడం లోనూ పైరవీలేనా...?

ఇంతవరకు బయట రాజకీయాలలో, సినిమాలలో పైరవీల ను చూస్తూ వచ్చాం.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భారతదేశంలో అనేక మంది కోవిడ్ బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

 Chee Chee Finally The Corona Is Not Even In The Undergoing Tests,  Coronavirus,-TeluguStop.com

అయితే కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో లక్షణాలు కనిపించిన వారందరూ కరోనా పరీక్షలు నిర్ధారణ కేంద్రాలకు రావడంతో అక్కడ రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోంది.పరీక్షలు చేయించేందుకు అనేకమంది కరోనా నిర్ధారణ కేంద్రాలకు రావడంతో అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది.

కొంతమంది కరోనా వైరస్ లేకున్నా సరే పరీక్షలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా కనబడుతోంది.

దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే సిబ్బందిపై సిఫారసుల ఒత్తిడి బాగా పెరుగుతోంది.

ఎవరైనా అధికారులు పైరవీలు చేసిన వారికి మాత్రమే మొదట పరీక్షలు చేసిన పరిస్థితి కనబడుతోంది.అంతేకాదు మరికొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది వచ్చినా కూడా పరీక్షలు నిర్వహించడం లేదు వైద్యాధికారులు.

అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే రేషన్ దుకాణాలకు వెళ్ళినప్పుడు టోకెన్లు తీసుకొని క్యూలో నిలబడే విధంగా ఉంది.ఒకరోజు టోకెన్స్ తీసుకొని మరో రోజు కరోనా పరీక్షలకు రావాలని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.కొన్నిచోట్ల తక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని చోట్ల మాత్రం కేవలం సిఫారసులు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తున్నారు.

దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో మామూలు జనం కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

రాజకీయ పార్టీల లీడర్ల రికమండేషన్ ఉన్న వారికి మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.వీటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube