'కరోనా వైరస్'కు విరుగుడు అదేనా?

కరోనా మహమ్మారి.ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించేస్తోంది.

 Coronavirus, Corona Vaccine, Tb Vaccine, Bcg, Newyork-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడం వల్ల రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఇప్పటికే ఈ కరోనా బారిన 12 లక్షలమందికిపైగా కరోనా బారిన పడ్డారు.

అందులో 69వేలమంది మృతి చెందారు.

ఇక పోతే ఈ కరోనా వైరస్ కు మందు కనుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే టీబీ వ్యాధికి.కరోనా వైరస్ కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని.అందుకే టీబీ వ్యాక్సిన్‌ భారత్‌ను కరోనా వైరస్ నుండి రక్షిస్తుంది అని అమెరికాలో న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది.

Telugu Corona Vaccine, Coronavirus, Newyork, Tb Vaccine-Latest News - Telugu

న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.ఈ టీబీ వ్యాక్సిన్‌ తీసుకున్న పలు దేశాల్లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉంది అని అంతేకాకుండా మృతుల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉందని చెప్తున్నారు.అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లో టీబీ కేసులు అత్యంత స్వల్పం.

దీంతో టీబీని నిరోధించే బీసీజీ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న నిబంధనలు అక్కడ లేవు.

ఇంకా కరోనాను విజయవంతంగా ఎదురుకున్న దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్‌ ప్రజలందరూ తప్పనిసరిగా తీసుకోవాలన్న జాతీయ నిబంధనలు ఉన్నాయి.

ఇంకా మన భారత్ లో కూడా టీబీ సోకకుండా బీసీజీ వ్యాక్సిన్‌ విస్తృతంగా వినియోగిస్తోంది.అందుకే కరోనా వ్యాధి విస్తరణ తక్కువగా ఉందని అయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube