ట్రెండ్ గా మారిన కరోనా పచ్చబొట్లు...!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మరి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈ కరోనా నేపథ్యంలో ఎవరికి వారు నివారణ మార్గాలను వెతుకుతూ ముందుకు సాగుతున్నారు.

 Corona Tattoos That Have Become A Trend Coronavirus, Tatoos, Trend, Viral, Han-TeluguStop.com

ఈ వ్యాధి పట్ల ఎంతైనా కాస్తోకూస్తో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.ఇలా అవగాహన ఉండడం వారిని ఏ విషయం అయిన పూర్తిగా నివారించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

ఇందుకు సంబంధించి అనేక మంది, అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఇకపోతే విదేశాలలో కొందరు టాటూ డిజైనర్లు పచ్చబొట్లు వేయించుకునే వారికోసం కొందరు డిజైనర్లు కరోనా వైరస్ టాటూ లను వారి శరీర భాగాలపై వేస్తున్నారు.

ఇలా పచ్చబొట్లు వేయించుకునే వారి కోసం కొత్తగా కరోనా డిజైన్స్ ను వారు సృష్టించారు.కరోనా వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలనే వివిధ మార్గాలను చూపుతూ వేసే టాటూలను, డిజైనర్లు కొత్తరకం కరోనా డిజైన్లను సృష్టించారు.

ఈ నేపథ్యంలో స్పెయిన్ దేశానికి చెందిన ఆండ్రెస్ అనే పచ్చబొట్టు డిజైనర్ వేసే వ్యక్తి… వైద్య నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు అనేక సంవత్సరాల నుండి పచ్చబొట్టు డిజైన్స్‌ వేస్తున్నాడు.ప్రస్తుతం కరోనా సమయంలో ఇచ్చిన సూచనల మేరకు ప్రజలకు కరోనా వైరస్ సంబంధించి పచ్చబొట్టుగా వేయించుకోవడానికి చాలా మంది కస్టమర్లు ఇష్టపడుతున్నారని ఆండ్రెస్ తెలుపుతున్నారు.

ఇలా అనేక మంది లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కొన్ని టాటూలను వేయించుకునేందుకు ప్రస్తుతం యువతరం బాగా ఇష్టపడుతున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా హ్యాండ్ వాష్, మాస్క్, కరోనా వైరస్ లాంటి వివిధ డిజైన్లలో పచ్చబొట్ల ను వేయించుకునేందుకు యువతరం ఇష్ట పడుతుందని తెలిపాడు.

ఈ టాటూలు ప్రజలపై సరైన ప్రభావం చూపుతాయని ధీమాగా చెబుతున్నాడు ఆ డిజైనర్.ప్రస్తుతం ఇలాంటి పచ్చబొట్లు వేయించుకోవటం యువత ఎక్కువగా ఆసక్తి చూపడంతో ఈ టాటూలు ట్రెండ్ గా కొనసాగుతున్నాయి.

మొత్తానికి ఈ కరోనా వైరస్ జాగ్రత్తలతో కూడిన టాటూలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube