తిరుపతిలో కరోనా,భయాందోళనలో జనాలు

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది.చైనా లో మొదలైన ఈ కరోనా మృత్యఘోష ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తుంది.

 Coronavirus Suspected Case In Tirupati-TeluguStop.com

భారత్ లో కరోనా కేసులు నమోదు అయినట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారుల అప్రమత్తత తో వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.అయితే తాజాగా తిరుపతిలో ఈ కరోనా పేరు వినిపిస్తుంది.

తైవాన్ వాసి కరోనా లక్షణాలతో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అతడ్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలోని ఐసోలేటెడ్ వార్డు కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.తైవాన్ నుంచి ఎదో పనిమీద తిరుపతికి వచ్చాడని,అయితే కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.

అగ్రరాజ్యం అమెరికా లో కూడా ఇటీవల కరోనా తోలి మరణం సంభవించిన విషయం తెలిసిందే.నలుగురి లో కరోనా లక్షణాలు గుర్తించిన అధికారులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి ఐసోలేటెడ్ ట్రీట్మెంట్ ఇస్తుండగా ఇటీవల ఒకరు కరోనా కు బలి అయినట్లు తెలుస్తుంది.

దీనితో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా కరోనా కు మందు కనుగొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా.చైనా తరువాత ఇరాన్ లో ఈ కరోనా వైరస్ అనేది బాగా వ్యాప్తి చెందింది.

ఇరాన్ లో కూడా ఈ వైరస్ తీవ్ర రూపం దాల్చడం తో అరబ్ దేశాలు సరిహద్దులను మూసివేసినట్లు తెలుస్తుంది.అయితే ఇప్పుడు తిరుపతి లో కూడా ఈ కరోనా గురించి తెలియగానే తిరుపతి వాసులు భయాందోళనలు చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube