శాస్త్రవేత్తల హెచ్చరిక: కరోనాలో మరో కొత్త లక్షణం!

గత కొన్ని నెలల నుంచి దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేశంలో ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 Doctors Say Stomach Pain Also Corona Virus Syptom, Coronavirus, Stomach Pain, Au-TeluguStop.com

అదే సమయంలో కరోనా వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.కరోనా విజృంభించిన తొలినాళ్లలో జలుబు, జ్వరం, తలనొప్పి మాత్రమే వైరస్ ప్రధాన లక్షణాలుగా ఉండేవి.

కానీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.వైరస్ రోజురోజుకు తన రూపాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలు కూడా మారుతున్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కరోనా కొత్త లక్షణం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది.అయితే ఈ లక్షణం కనిపించినా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వైద్యులు, శాస్త్రవేత్తలు తాజాగా పొత్తి కడుపు నొప్పి కరోనా కొత్త లక్షణం అని తేల్చారు.ఆస్ట్రేలియాలోని క్యూన్స్ లాండ్‌లో ఒక నర్సుకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది.

వైద్యులు అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు వైరస్ నిర్ధారణ అయింది.దీంతో వైద్యులు కడుపునొప్పి కూడా కరోనా లక్షణమేనని చెబుతున్నారు.

గతంలో రాయల్ కాలేజ్ ఫిజీషియన్స్ అధ్యయనంలో సైతం శాస్త్రవేత్తలు కడుపునొప్పిని కరోనా లక్షణంగా గుర్తించారు.మరికొందరు కరోనా రోగుల్లో కడుపునొప్పితో పాటు డయేరియా, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

ఎవరిలోనైనా కడుపునొప్పి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube