ఇది మీరు చూశారా : కరోనా వల్ల కలిగే ప్రయోజనాలు అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌  

Coronavirus Social Media Funny Messages - Telugu Corona Virus Use Funny Forward Whats App Massage, Coronavirus, Facemasks, Netizens, Social Media, Whatsapp Messages

ఈ కరోనా ఏమో కాని ఇంట్లో ఉన్న వారు సోషల్‌ మీడియాలో ఈమద్య చాలా యాక్టివ్‌ అయ్యారు.లాక్‌ డౌన్‌కు ముందు వరకు ఉద్యోగస్తులు బిజీ బిజీగా ఎవరి పని వారు చేసుకుంటూ ఉండేవారు.

 Coronavirus Social Media Funny Messages

కాని ఇప్పుడు అంతా కూడా సోషల్‌ మీడియా మీద పడ్డారు.ఎవరికి ఇష్టం వచ్చినవి వారు పోస్ట్‌ చేస్తున్నారు.

కొందరు రచయితలు అవుతుంటే మరికొందరు మీమ్స్‌ క్రియేటర్స్‌ అవుతున్నారు.మరికొందరు ఫన్నీ క్రియేటర్స్‌ అవుతున్నారు.

ఇది మీరు చూశారా : కరోనా వల్ల కలిగే ప్రయోజనాలు అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మొత్తానికి సోషల్‌ మీడియాను విచ్చలవిడిగా ఈ లాక్‌ డౌన్‌ కాలంలో నెటిజన్స్‌ ఉపయోగిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో కొన్ని పోస్ట్‌ు అత్యధికంగా వైరల్‌ అవుతున్నాయి.

అందులో ఎక్కువ శాతం కరోనా వైరస్‌ నుండి దూరంగా ఎలా ఉండాలి, కరోనా వల్ల జీవితంలో ఏర్పడిన మార్పు ఏంటీ అనే విషయాలను అందులో చెప్పారు.కాని ఇప్పుడు నేను చెప్పబోతున్న పోస్ట్‌లో మాత్రం కరోనా వల్ల కలిగిన ప్రయోజనాలు చెబుతున్నారు.

కరోనాతో భయంకర పరిస్థితులు ఏర్పడితే యుద్దం కంటే మించిన ప్రమాదం ఇది అంటూ ఉంటే కొందరు మాత్రం కరోనాతో ఇలా హెల్ప్‌ అయ్యిందని అంటున్నారు.

ఇంతకు ఆ ప్రయోజనాలు ఏంటో చూసేద్దామా.

గతంలో ఆదివారం కోసం ఎదురు చూసేవారు.కాని కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ తో ప్రతి రోజు ఆదివారమే అయ్యింది బయటి తిండి ఏమాత్రం మంచిది కాదని ఎవరు ఎంతగా మొత్తుకున్నా కూడా జనాలు మానలేదు.

కాని ఇప్పుడు బయటకి అంటేనే భయపడుతున్నారు.
పొద్దున లేస్తే టీవీలు పెడితే రాజకీయ నాయకుల విమర్శలు ప్రతివిమర్శలు.

కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట కరోనా మాట.రాజకీయాలు అనే మాటే లేకుండా పోయింది.
గతంలో పరిశుభ్రతను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.నూడిల్స్‌ గొడవ తగ్గింది పిల్లలు అమ్మ చేతి ముద్దలు తింటున్నారు.
ఎప్పుడు సమ్మర్‌ హాలీడేస్‌ రెండు నెలలు అయితే ఈసారి మూడు నెలలు అంటూ పిల్లలు సంబుర పడుతున్నారు.నిత్యం రోడ్లపై యాక్సిడెంట్స్‌ అంటూ వార్తలు వచ్చేవి.

కాని కరోనా కారణంగా వేలాది మంది యాక్సిడెంట్స్‌ నుండి తప్పించుకున్నారు.
పోలీసులకు ఇబ్బంది పెట్టే వ్యభిచారం ఇతరత్ర కేసులు పూర్తిగా తగ్గిపోయాయి.
గత కొన్ని రోజులుగా పూర్తిగా కాలుష్య నివారణ జరిగింది.
చదువు, ఉద్యోగం అంటూ కుటుంబ సభ్యులు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లేవారు.

కాని ఇప్పుడు అంతా ఒకేచోట కలిసి ఉంటున్నారు.ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది.
గతంలో పండగ రోజు మాత్రమే కుటుంబ సభ్యులు అంతా ఇంట్లో ఉండేవారు.కాని ఇప్పుడు ప్రతి రోజు ఇంట్లోనే ఉంటూ పండగ చేసుకుంటున్నారు.

ఇలా కరోనా వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయంటూ నెటిజన్స్‌ ప్రచారం చేస్తున్నారు.అంతే కదా కరోనా భయంతో ఆందోళన చెందకుండా దాని ప్రయోజనాలను ఇలా పొంది పూర్తిగా ఇంటికే పరిమితం అయితే బాగుంటుంది కదా.మీరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకండి ప్లీజ్‌.ఈ సమాచారంను మీరు షేర్‌ చేయండి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Social Media Funny Messages Related Telugu News,Photos/Pics,Images..