కేరళ సరికొత్త ఆలోచన, గొడుగుతో కరోనా కు చెక్

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.సామజిక దూరం పాటించాలి అంటూ నిపుణులు ఎంతగా చెప్పినప్పటికి జనాలు మాత్రం దీనిని పాటించడం లో మాత్రం విఫలమౌతూనే ఉన్నారు.

 Umbrella To Fend Off Corona  Coronavirus, Social Distance, Lock Down, Kerala, Fa-TeluguStop.com

ఈ క్రమంలో కేరళ లోని ఒక గ్రామం జనల మధ్య సామజిక దూరం పాటించడం పై ఒక సరికొత్త ఆలోచన చేసింది.జనాలు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించేందుకు ఆ గ్రామ పంచాయితీ సరికొత్తగా గొడుగులను ఉపయోగించాలి అంటూ సూచించింది.

ప్రజలు మార్కెట్లు,ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గుమి గూడటం అనేది జరుగుతూ ఉంది.అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఆ గ్రామం.

ఇకపై ఎవరైనా బయటకు వస్తే మాస్కు తో పాటు,గొడుగును కూడా వెంట తెచ్చుకోవాలి అంటూ ఆదేశించారు. కేరళ లోని అలపుళ సమీపంలోని తన్నీర్ ముక్కుమ్ గ్రామ పంచాయితీ ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలుస్తుంది.

దీనితో ఆ గ్రామ నిర్ణయానికి పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.అయితే గొడుగుల వల్ల కరోనా కు చెక్ ఎలా పెట్టొచ్చు అని ఆలోచిస్తున్నారా.

గొడుగును ఉపయోగించినప్పుడు మనకు తెలియకుండానే వ్యక్తుల మధ్య భౌతిక దూరం ఏర్పడుతుంది అని అంటున్నారు.ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు గొడుగు పరిమాణం కారణంగా అవి తగలకుండా మనకు తెలియకుండానే దూరం దూరంగా ఉంటూ ఉంటాం.

దీని ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని ఇలాంటి సరికొత్త ఆలోచన చేశారు.

అంతేకాదు గొడుగులు అందుబాటులో లేని వారికి గ్రామ పంచాయతీ అధికారులు స్వయంగా సగం ధరకే వాటిని పంపిణీ చేయడం మరో విశేషం.

ఈ విషయం తెలిసిన మంత్రి థామస్ ఆలోచన బాగుందని కితాబిచ్చారు.ప్రతి ఒక్కరు ఇలా భౌతిక దూరం పాటించాలంటూ మంత్రిగారు కూడా సూచించారు.

అయితే ఇక అందరూ కూడా గొడుగులు పట్టుకొని బయటకు వెళ్లడం ఉత్తమంగా తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube