సీజనల్ వ్యాధిగా మిగిలిపోనున్న కరోనా.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!  

coronavirus ends as a seasonal virus says latest survey! coronavirus, covid-19, seasonal virus, latest survey, latest news, coronavirus updates - Telugu Coronavirus, Coronavirus Updates, Covid-19, Latest News, Latest Survey, Seasonal Virus

ప్ర‌పంచంలో న‌లువైపుల నుంచి విజృంభిస్తున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్.ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న విష‌యం తెలిసిందే.

TeluguStop.com - Coronavirus Seasonal Disease Says Latest Survey

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

చైనాలో జీవం పోసుకున్న క‌రోనా వైర‌స్ వ‌చ్చి ఎనిమిది నెల‌లు గ‌డిచిపోయినా.ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని నాశనం చేసే స‌రైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

TeluguStop.com - సీజనల్ వ్యాధిగా మిగిలిపోనున్న కరోనా.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో అడ్డు అపులు లేకుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ శ‌ర వేగంగా విజృంభిస్తూ.ల‌క్ష‌ల ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటోంది.
ఇక మ‌రోవైపు కంటికి క‌నిపించ‌ని ఈ క‌రోనా వైర‌స్ గురించి రోజుకో భ‌యంక‌ర విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది.ప్రపంచాన్ని భ‌యంక‌రంగా వ‌ణికిస్తున్న ప్రాణాంత‌క‌ కరోనా వైర‌స్‌ చివరికి సీజనల్ వ్యాధిగా మిగిలిపోనుందని తాజాగా ఓ అధ్య‌య‌నం వెల్లడించిన విషయాలు దిగ్భ్రమకు గురిచేస్తున్నాయి.

సామాజిక రోగ నిరోధకత(హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించే వరకు ప్రతీ సీజన్‌లోనూ క‌రోనా వైర‌స్ వస్తూనే ఉంటుందని అధ్యయనం స్ప‌ష్టం చేసింది.

లెబనాన్‌లోని బీరూట్ అమెరికన్ యూనివర్సిటీ తాజాగా శ్వాసకోశ సంబంధ వైరస్‌లు సీజన్ల వారీగా ఎలా వ్యాప్తిచెందుతాయి? భ‌యంక‌ర క‌రోనా వైర‌స్ ముందు ముందు ఎలా పరిణమించబోతోందన్న అంశంపై అధ్య‌యనం నిర్వ‌హంచ‌గా.హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగితే క‌రోనా వైర‌స్ క్ర‌మంగా త‌గ్గుందుని తేలింది.అయితే సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వ‌స్తుంద‌ని తెలిపారు.
అందుకే ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్‌పై భ‌యాన్ని త‌గ్గించి.ఆ మ‌హ‌మ్మారి నుంచి ఎలా ర‌క్షించుకోవాలి అనే దానిపై దృష్టి సారించాల‌ని పేర్కొన్నారు.

కాగా, ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు కోట్ల‌కు చేరువ అవుతోంది.మ‌రోవైపు క‌రోనా కాటుకు బ‌లైపోయిన వారి సంఖ్య ఏకంగా తొమ్మిది ల‌క్ష‌లు మించిపోయింది.

అయితే పాజిటివ్ కేసులు పెర‌గ‌డంతో పాటు.రిక‌వ‌రీ కేసులు కూడా పెరుగుతుండ‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే అంశంగా చెప్పుకోవ‌చ్చు.

#Coronavirus #COVID-19 #Seasonal Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Seasonal Disease Says Latest Survey Related Telugu News,Photos/Pics,Images..