రెండోసారి కరోనా : వాస్తవాలు చెప్పిన శాస్త్రవేత్తలు!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 70,000కు పైగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

 Facts About Second Time Corona Virus Infection, Coronavirus, Scientists, Clinica-TeluguStop.com

కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు కూడా భారీగానే ఉంది.అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లు మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు.

దీంతో రెండోసారి కరోనా సోకుతోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

రెండోసారి కరోనా వైరస్ సోకటం గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి స్పష్టత ఇచ్చారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్ల శరీరంలో ఉన్న మృత వైరస్ ల వల్లే రెండోసారి కరోనా సోకుతోందని తెలిపారు.కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని, శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తే గుర్తు పట్టే బీ, టీ కణాలు కూడా డెవలప్ అవుతాయని, రెండు నుంచి మూడు నెలల వరకు యాంటీబాడీలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డీసీజెస్‌ జర్నల్ లో రెండోసారి కరోనా సోకినా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.తొలి ఇన్ఫెక్షన్ నుంచి శరీరం మృత కరోనా వైరస్ లను విడుదల చేస్తుండటం వల్ల రెండోసారి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

డాక్టర్ అనురాగ్ అగర్వాల్ రెండోసారి కరోనా వైరస్ సోకడం గురించి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో వాటి గురించి స్పష్టతనిచ్చారు.

దేశంలో కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వస్తుండటం వాస్తవమేనని అయితే అసలైనా రీ ఇన్ఫెక్షన్ ను మాత్రం తాను చూడలేదని తెలిపారు.

రెండవ సారి కరోనా నిర్ధారణ అయిన వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తాము గుర్తించలేదని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube