ప్రపంచంలో అన్ని దేశాలను కరోనా వైరస్ కొన్ని రోజుల పాటు గజగజా వణికించిన విషయం తెలిసిందే.చైనాలోని వుహాన్ నుండి వ్యాపించిన ఈ వైరస్ బారిన పడి 2000 మందికి పైగా మృతి చెందగా 70,000 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
కానీ గత కొన్ని రోజుల నుండి చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరోనా తగ్గుముఖం పట్టింది.ఇప్పుడిప్పుడే చైనాలో కరోనా వైరస్ కట్టడి అవుతోంది.
చైనాలో వైద్య బృందం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కరోనా బాధితులకు సేవలు చేయటంతో పాటు వారి కోసం నిరంతరం శ్రమించారు.కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య చైనాలో రోజురోజుకు తగ్గుతుండడంతో వైద్యులు అనందం వ్యక్తం చేయడంతో పాటు సంతోషంలో డ్యాన్స్ చేశారు.
వైద్య సిబ్బంది చేస్తున్న డ్యాన్స్ కరోనా రిలీఫ్ డ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైనాలో కరోనా మరణాలు, వైరస్ వ్యాప్తి రోజురోజుకు తగ్గుతోంది.
కరోనా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇద్దరు డాక్టర్లు డ్యాన్సులు వేశారు.మాస్కులో ఉన్న ఇద్దరు డాక్టర్లు డ్యాన్స్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్పత్రి నుండి కిందకు దిగుతూ లిఫ్ట్ లో వారు డ్యాన్స్ చేశారు.ఈ వీడియోకు వందల సంఖ్యలో లైక్ లు, షేర్ లు వస్తున్నాయి.