జక్కన్న ఫ్యామిలీకి కరోనా ఎలా వచ్చి ఉంటుంది?  

Rajamouli, Corona virus, COVID Effect, Rajamouli Farm House, Kartikeya - Telugu Corona Virus, Covid Effect, Kartikeya, Rajamouli, Rajamouli Farm House

నిన్న సాయంత్రం సమయంలో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని షాకింగ్‌ న్యూస్‌ ను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెల్సిందే.కరోనా నుండి జాగ్రత్తగా ఉండండి అంటూ చాలా సార్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పర్చిన రాజమౌళికి ఇలా ఎలా జరిగింది అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

 Coronavirus Rajamouli Family

కొన్ని రోజుల క్రితం రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కూడా ఫామ్‌ హౌస్‌కు షిఫ్ట్‌ అయ్యారనే ప్రచారం జరిగింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫామ్‌ హౌస్‌కు వెళ్లినా కూడా జక్కన్నను మరియు ఆయన ఫ్యామిలీని ఆ మహమ్మారి వైరస్‌ వదిలి పెట్టలేదు.

అయితే వీరికి వైరస్‌ ఎలా వ్యాప్తి చెంది ఉంటుంది అనే విషయంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వారి ఇంట్లో పని చేసే వారి ద్వారా ఇది వచ్చి ఉంటుందని అంటున్నారు.

జక్కన్న ఫ్యామిలీకి కరోనా ఎలా వచ్చి ఉంటుంది-Movie-Telugu Tollywood Photo Image

అంతకు మించి మరే మార్గం లేదని, వారు పూర్తి భద్రతతో ఉన్నప్పుడు వారికి కరోనా ఎలా సోకుతుందని అంటున్నారు.

రాజమౌళి ఒక వేళ బయటకు వెళ్లినా కూడా చాలా సేఫ్టీ చూసుకుంటారు.అలాంటి జక్కన్న బయట కరోనాను అంటించుకుని ఉండరు.ఇంట్లో సభ్యులు ఎవరైనా బయటకు వెళ్లిన సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ఏమైనా జరిగి ఉంటుందేమో అంటున్నారు.

జక్కన్న తనయుడు అయిన కార్తికేయ స్నేహితులు అంటూ బయట తిరిగి మళ్లీ ఇంట్లోకి వచ్చిన సమయంలో ఏమైనా అతడితో వైరస్‌ వచ్చి ఉంటుందా అనేది కొందరి అనుమానం.మొత్తానికి అమితాబ్‌కు వచ్చిన సమయంలో ఎంతటి హడావుడి కనిపిస్తుందో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో జక్కన్నకు కరోనా అంటూ నిర్థారణ అయ్యిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

#Covid Effect #Rajamouli #Kartikeya #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Rajamouli Family Related Telugu News,Photos/Pics,Images..