సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటూ కోర్టు ను ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

పీపీఈ కిట్లు లేవని ప్రభుత్వం మీద విమర్శలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఎనస్థటిస్ట్ డాక్టర్ సుధాకర్ తన ట్రీట్ మెంట్ విషయంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది.రోడ్డుపై అర్ధ నగ్నంగా డాక్టర్ల కు పీపీఈ కిట్లు లభించడం లేదని ప్రశ్నించినందుకు నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు అంటూ నిరసన తెలపడం తో ఆయన చేతులను వెనక్కి కట్టి, లాఠీ తో కొట్టారు.

 Dr.sudhakar Approach High Court About The Treatment , Coronavirus, Ppe Kits, Sud-TeluguStop.com

ఈ దృశ్యాలు పలు మీడియా ఛానల్స్ లో కూడా ప్రసారం అయ్యాయి.ఒక డాక్టర్ పై పోలీసులు ప్రవర్తించిన తీరుపై కోర్టు తో పాటు పలువురు తీవ్రంగా తప్పుపట్టారు.

దీనితో ఈ కేసు విచారణను సీబీఐ కి అప్పగించింది.

Telugu Ap, Coronavirus, Ppe Kits, Effects, Sravan Kumar, Sudhakar-Political

అయితే ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదంటూ విశాఖ లో మానసిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే మానసిక ఆస్పత్రిలో తనకు వైద్యం సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన సుధాకర్…తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలంటూ కోర్టును అభ్యర్థించారు.కోర్టు పర్యవేక్షణలో తనకు వైద్యం జరపాలని సుధాకర్‌ న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదని, ట్యాబ్లెట్ల వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు.అంతేకాకుండా వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయని నోటిలో బొబ్బలు వచ్చినట్లు కోర్టు కు వెల్లడించారు.అలానే సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తెలిపారు.

‘డాక్టర్‌ సుధాకర్‌కు అందిస్తున్న వైద్యం పట్ల అనుమానాలున్నాయి.సుధాకర్‌పై పిచ్చోడనే ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన న్యాయవాది శ్రావణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సుధాకర్‌ను మానసిక ఆస్పత్రికి ఎందుకు తరలించారనేది సందేహంగా ఉంది.అంతేకాకుండా వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని కూడా ఉందని తాము భావిస్తున్నాం అని డాక్టర్ సుధాకర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube