కరోనా నుంచి కోలుకుని మరొకరి కోసం: ఫ్లాస్మాను దానం చేసిన ఎన్ఆర్ఐ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు ఇంత వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో రాలేదు.హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ వంటి ప్రత్యామ్నాయ ఔషధాలతోనే వైద్యులు కోవిడ్‌ రోగులను నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 Recovered Uk Nri To Donate Plasma For Covid-19 Patients Coronavirus, Plasama The-TeluguStop.com

అయితే గత కొన్ని రోజులుగా ఫ్లాస్మా థెరపీ అనే మాట వార్తల్లో వినిపిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ విధానంతో సత్ఫలితాలు రావడాన్ని పరిశోధకులు గుర్తించారు.

అమెరికాలో దాదాపు 1,500కు పైగా ఆసుపత్రుల సమన్వయంతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు.ఇప్పటికే 600 మందికి పైగా రోగులకు ఈ విధానం ద్వారా చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగ నిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.అందువల్ల కోవిడ్ 19 నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి ఫ్లాస్మాను సేకరించి, వైరస్‌తో బాధపడుతున్న వారి శరీరంలోకి ఎక్కిస్తారు.

దీనినే ఫ్లాస్మా థెరపీ అంటారు.మానవతా దృక్పథంతో చాలా మంది తమ ఫ్లాస్మాను దానం చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న ఓ ఎన్ఆర్ఐ ఫ్లాస్మాను డోనేట్ చేశాడు.

Telugu Coronavirus, Donateplasma-

వడోదరాలోని జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజ్, గోత్రిలు ఫ్లాస్మా థెరపీని ప్రారంభించేందుకు ఐసీఎంఆర్ అనుమతించింది.58 ఏళ్ల విపుల్ పటేల్‌.కరోనా సోకడంతో గోత్రి ఆసుపత్రిలో చికిత్స పొందారు.

మార్చి 27న పాజిటివ్‌గా తేలినప్పటి నుంచే అక్కడి వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన ఉంటున్నాడు.వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఏప్రిల్ 10న డిశ్చార్జ్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో ఫ్లాస్మా థెరపీ కోసం వైద్యులు ఆయనను సంప్రదించగా విపుల్ ఫ్లాస్మా దానం చేయడానికి అంగీకరించారు.ఇందుకోసం ఆయన రక్తం, యాంటీబాడీని తనిఖీ చేసి అనంతరం ఫ్లాస్మాను సేకరించాలని నిర్ణయించి ఐసీఎంఆర్‌కు సమాచారం అందించారు.

అన్ని అనుమతులు అందుకుని వడోదరాలో కోవిడ్ 19కి ఓఎస్డీగా నియమించబడిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వినోద్ రావు సమక్షంలో వైద్యులు విపుల్ పటేల్ నుంచి ఫ్లాస్మాను సేకరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube