బిగ్ బ్రేకింగ్: ఈ నెల 31 వరకు లాకౌట్ దిశగా రాష్ట్రాలు

కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగంగా దేశం యావత్తు జనతా కర్ఫ్యూలో స్వచ్చందంగా పాల్గొన్నాయి.అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Coronavirus Outbreak 8 States Under Lockdown In India-TeluguStop.com

ఇక ప్రజలు రోడ్ల మీదకి రాకుండా పోలీసులు రక్షణగా ఉన్నారు.ఇక సెలబ్రేటీల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు అందరూ జనతా కర్ఫ్యూపై స్వచ్చందంగా ప్రచారం చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.ఈ నెల 31 వరకు జనతా కర్ఫ్యూని కొనసాగించాలని భావిస్తున్నాయి.
అయితే ఈ కర్ఫ్యూను పలు రాష్ట్రాలు పొడగించేందుకు సిద్ధమయ్యాయి.ఇందులో భాగంగా చాలా రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి.రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశాయి.దీంతో ఆయా రాష్ట్రాల్లో నిత్యావసరాలు, అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ రద్దు చేయనున్నారు.

ఇటు మహారాష్ట్రలో మాత్రం 144 సెక్షన్ అమల్లో ఉంది.మరో వైపు ఇదే దారిలో తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

రోజు వారి కూలీలు, కార్మికులకి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి.దీనిపై ముఖ్యమంత్రులు ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

దీనిపై ఈ రోజు సాయంత్రానికి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube