కరోనా కల్లోలం.. వణికి పోతున్న ఆ రెండు జిల్లాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ఈ మహమ్మారి వైరస్ మరింతగా విజృంభిస్తోంది.

 Coronavirus Is Most Prevalent In The Two Districts Of Andhra Pradesh,corona Viru-TeluguStop.com

కర్నూలు కృష్ణా జిల్లాలలో అయితే ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది అనే చెప్పాలి.ఓవైపు కేసులు భారీగా పెరిగిపోవడమే కాదు మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కరోనామృతులు కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఈ జిల్లాల్లో ఎక్కువగా మరణిస్తున్నారని వైద్య అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కేసులు మరణాలలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

కర్నూలు నగరంతో పాటు పలు పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి.

ఇక మరణాలు కూడా సగానికి పైగా కర్నూలు నగరంలోనే ఉండటం గమనార్హం.ఇప్పుడు వరకు కర్నూలు జిల్లాలో ఏకంగా 58 మంది మరణించారు.

ఇక కృష్ణాజిల్లాలో 63 మంది కరోనా తో మరణించారు.వీరిలో ఎక్కువగా 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఉన్నారు.అయితే జాతీయ స్థాయిలో మరణాల సంఖ్య 2.97 ఉంటే ఈ జిల్లాల్లో మాత్రం మరణాల సంఖ్య 4.29 శాతం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube