చీపురు వల్ల కరోనా అధిక వ్యాప్తి.. జాగ్ర‌త్త అంటున్న నిపుణులు!

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.ఇప్పుడు ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 Coronavirus May Spread From Broom Says Aiims Doctor! Coronavirus, Coronavirus Sp-TeluguStop.com

ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసే మందుగాని.అంతం చేసే వ్యాక్సిన్‌గాని ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది.ఇక ఇప్ప‌టికే ప్రపంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 3కోట్ల 17 లక్షలు మించిపోయింది.
అలాగే క‌రోనా వైర‌స్ కోర‌ల్లో చిక్కుకుని మ‌ర‌ణించిన వారి సంఖ్య 9.7 ల‌క్ష‌ల‌కు చేరుకుంది.ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో మాస్కులు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, శానిటైజర్లు వాడ‌టం చాలా కీల‌కంగా మారాయి.ప్ర‌జ‌లు కూడా వీటికి అల‌వాటు ప‌డిపోయారు.ఇదిలా ఉంటే.మ‌రోవైపు క‌రోనా గురించి రోజుకో విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది.

ఇక తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు క‌రోనా వైర‌స్ గురించి ఓ కొత్త విష‌యం బ‌య‌ట‌పెట్టారు.

బ‌య‌ట చీపురు వాడ‌డం వ‌ల్ల క‌రోనా అధికంగా వ్యాప్తి చెందుతుంద‌ని బాంబ్ పేల్చారు వైద్యులు.

అదెలా అంటే.చీపురుతో ఊడ్చిన‌ప్పుడు నేలపై ఉండే దుమ్ము పైకి లేస్తుంది.

ఒక‌వైళ అందులో కరోనా వైరస్ ఉంటే.దుమ్ముతో పాటే అదీ వ్యాపిస్తుంద‌ట‌.

ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ ఊడ్చేవారితో పాటు అటుగా వ‌చ్చే ఇత‌రుల‌కు కూడా సోకే ప్రమాదం ఎక్కువ‌గా ఉంది అని అంటున్నారు నిపుణులు.
అందుకే బయట చీపురు బదులు వాక్యూమ్ క్లీనర్ వాడమని సూచిస్తున్నారు.

అయితే వాక్యూమ్ క్లీన‌ర్ కొనుగోలు చేసే స్థోమత లేని వారు దేశంలో కోట్ల మంది ఉన్నారు.అలాంటి వారు చాలా జాగ్ర‌త‌గా ఉండాల‌ని సూచించారు.కాగా, భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,663కి చేరింది.అలాగే క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 90 వేల‌కు చేరువ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube