కర్ణాటకను వణికిస్తున్న కరోనా,ఏకంగా లక్షన్నర...

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.గత 8 రోజులుగా వరుసగా 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ప్రజల్లో భయాందోళనలను అధికం చేస్తుంది.

 5 Thousand Above Covid Cases Registered In Karnataka State Within Oneday, Corona-TeluguStop.com

ఒకపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎంతగా పెరుగుతున్నాయో రాష్ట్రాల వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు రోజుకు అధికంగా నమోదు అవుతున్నాయి.ఒక పక్క లాక్ డౌన్ విధిస్తూ ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కేసులు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.

మరి ముఖ్యంగా కర్ణాటక,కేరళ రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.ఏప్రిల్,మే నెలల్లో కేవలం 400, 500 ల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయిన కర్ణాటక లో నేడు ఆ సంఖ్య లక్షన్నరకు చేరుకోవడం గమనార్హం.

గడచిన 24 గంటల్లో కొత్తగా 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం.ఈ మహమ్మారి ఆ రాష్ట్ర సీఎం ను సైతం వదల్లేదు.

కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా ఇటీవల ఈ వైరస్ బారిన పడి బెంగుళూరు లోని మణిపాల్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదుకాగా,ఈ మహమ్మారి కారణంగా 2,804 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో కూడా కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజుకు కూడా అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.మహారాష్ట్ర తరువాత తమిళనాడు,ఢిల్లీ,గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube