ప్రజల మీద నిప్పులు చెరిగిన సీఎం,మరోసారి లాక్ డౌన్ అంటూ…..  

Coronavirus Lock Downyediyurappa - Telugu Coronavirus, Karnataka, Karnataka Cm Yediyurappa, Lock Down, Pachim Bengal, Yediyurappa

కరోనా మహమ్మారి తో దేశం అల్లాడిపోతోంది.ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చినప్పటికీ కూడా కరోనా కేసులు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

 Coronavirus Lock Downyediyurappa

రోజు రోజుకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం తో అందరూ ఆందోళన చెందుతున్నారు.కర్ణాటకలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

దీనితో ఏకంగా ఆ రాష్ట్ర సీఎం ప్రజల మీద నిప్పులు చెరిగారు.ఎలాంటి నిబంధనలు పాటించని ప్రజల మీద నిప్పులు చెరిగిన ఆయన అంతటితో ఆగకుండా మరోసారి లాక్ డౌన్ విధిస్తాను అంటూ హెచ్చరించారు.

ప్రజల మీద నిప్పులు చెరిగిన సీఎం,మరోసారి లాక్ డౌన్ అంటూ…..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కర్ణాటకలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు‌ పెరుగుతున్నాయి.

దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బెంగళూరు వాసులను గురువారం హెచ్చరించారు.

కరోనా కేసులు ఇంతలా పెరగడానికి ప్రజల్లో నియంత్రణ లేకపోవడమే అంటూ ఆయన అసహనం వ్యక్తంచేశారు.కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదా మరోసారి లాక్‌డౌన్‌ విధించమంటారా? అంటూ సాక్షాత్తు సీఎమే ప్రజలపై మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్ మాదిరి జులై 31 వరకు లాక్‌డౌన్ విధిస్తే తిక్క కుదురుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.తిరిగి లాక్‌డౌన్‌ విధించకుండా ఉండాలంటే తప్పసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

కరోనా నివారణ చర్యలపై ఆయన అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది.

కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తుంది.

కాగా మరోపక్క గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 418 మంది మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీనితో ఇప్పటివరకు భారత్‌లో‌ మొత్తం 4,73,105 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 14,894కు చేరినట్లు తెలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కరోనా కేసుల సంఖ్య కోటికీ చేరువలో ఉన్న విషయం విదితమే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Lock Downyediyurappa Related Telugu News,Photos/Pics,Images..

footer-test