వారు రీల్‌ స్టార్స్‌ కాని ప్రణీత రియల్‌ స్టార్‌

హీరోలు పలువురు ఈ విపత్తు సమయంలో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.కాని హీరోయిన్స్‌ మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు.

 Actress Pranitha Help The Poor Peoples In Corona Time,  Coronavirus, Lock Down,-TeluguStop.com

కనీసం విరాళాలు ఇచ్చేందుకు సైతం వారు ముందుకు రావడం లేదు.ఇటీవలే కాజల్‌, తమన్నాలు మాత్రమే విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే.

మరికొందరు కోట్లు తీసుకునే హీరోయిన్స్‌ ఉన్నా కూడా వారు మాత్రం ఇప్పటి వరకు విరాళం ప్రకటించలేదు.

హీరోయిన్‌గా పెద్దగా ఆఫర్లు లేకున్నా, అసలు సినిమాల్లో నటించినవి కూడా సక్సెస్‌ కాకున్నా కూడా ప్రణీత మాత్రం మొదట్లోనే తనకు సాధ్యం అయినంత విరాళంను ప్రకటించింది.

కేవలం విరాళం ఇచ్చి ఊరుకోకుండా ఆమె తనవంతు సాయం అన్నట్లుగా తన చుట్టు పక్క ఉన్న వారి కడుపు నింపేందుకు ప్రయత్నిస్తుంది.ప్రతి రోజు కనీసం వంద మందికి ఆమె కడుపు నింపుతుందని తెలుస్తోంది.

Telugu Coronavirus, Kajalagarwal, Lock, Pranitha, Pranithapoor, Tamannah-Movie

గత వారం పది రోజులుగా ఆమె ఉదయం సాయంత్రం స్వయంగా తన స్నేహితులతో కలిసి వంట చేసి పేదవారికి ఇస్తుంది. ఆమె మంచి మనసు ముందు స్టార్‌ హీరోయిన్స్‌ దిగదుడుపే.స్టార్‌ అంటే గొప్ప వారు అని అర్థం.హీరోయిన్స్‌ రీల్‌ స్టార్స్‌ అయితే ఈమె మాత్రం రియల్‌ స్టార్‌ అంటూ ప్రశంసలు దక్కించుకుంటుంది. మంచి మనసున్న ప్రణీతకు ఇప్పటికైనా సినిమాల్లో ఆఫర్లు ఇవ్వాలంటూ ఆమె అభిమానులు ఈ సందర్బంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube