ముంబయిలో షూటింగ్‌కు ఓకే, హైదరాబాద్‌కు ఏమైంది?  

Coronavirus Lock Down Movieshootings - Telugu Cinima Shootings, Coronavirus, Hyderabad Shootings, Lock Down, Maharastra. Movie Shootings Permissions, Telangana Governament

ఇండియాలో కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు అవుతున్న విషయం తెల్సిందే.అక్కడ పరిస్థితి చేయి దాటి పోయింది.

 Coronavirus Lock Down Movieshootings

లక్ష వరకు అక్కడ కేసులు నమోదు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఆరోగ్య నిపుణులు అధికారులు అంటున్నారు.అంతటి పరిస్థితి ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చింది.

ముంబయిలో లిమిటెడ్‌ సంఖ్యలో యూనిట్‌ సభ్యులతో షూటింగ్‌ చేసుకోవచ్చు.కాని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం షూటింగ్స్‌ విషయంలో పట్టించుకోవడం లేదు.

ముంబయిలో షూటింగ్‌కు ఓకే, హైదరాబాద్‌కు ఏమైంది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గత రెండు వారాలుగా పరిస్థితి అంతా సాదారణ పరిస్థితికి వచ్చేసింది.దాదాపుగా 85 శాతం రంగాల్లో లాక్‌ డౌన్‌ మినహాయింపులు ఇచ్చారు.ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో షూటింగ్స్‌కు ఒప్పుకోక పోవడంతో తెలుగు సినిమా మరియు బుల్లి తెర రంగాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సినిమా పరిశ్రమను అంత చిన్న చూపు చూస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

కొన్ని వేల మంది జీవితాలు షూటింగ్స్‌ లేకపోవడంతో రోడ్డున పడ్డాయి.ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి.ఒక్క షూటింగ్స్‌ ఆపేయడం వల్ల కరోనా కేసులు నమోదు కాకుండా ఉంటున్నాయా, ఒక వేళ షూటింగ్స్‌ ప్రారంభిస్తే కరోనా కేసులు పెరుగుతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.మరి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..