కేసీఆర్ పై కరోనా నిందలు ? నిర్లక్ష్యమే కొంపముంచిందా ?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 In Telangana Increased More Corona Cases Reason Behind Is Kcr Not Focus On Coror-TeluguStop.com

మొదటి నుంచి కేసీఆర్ కరోనా విషయంలో అప్రమత్తంగానే ఉంటూ వచ్చారు.కేంద్రం విధించిన లాక్ డౌన్ కంటే కేసిఆర్ కాస్త ఎక్కువ రోజులు ఈ నిబంధనలు విధిస్తూ వచ్చారు.

అలాగే లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు ఇచ్చే విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించారు.మొదట్లో ఇక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు గానే కనిపించినా, ఆ తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం వంటి కారణాలతో కేసిఆర్ పై విమర్శలు మొదలయ్యాయి.

అది కాకుండా కరోనా టెస్టులు చేసే విషయంలో కేసీఆర్ మొదటి నుంచి కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు లేకపోలేదు.

Telugu Coronavirus, Hyderabad, Kishan Reddy, Lock, Majlis, Markaz Links, Telanga

కరోనా టెస్ట్ లు ఎక్కువ చేస్తే అవార్డు ఏమైనా ఇస్తారా అని కేసిఆర్, కేటీఆర్ వంటి వారు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ విపక్ష పార్టీలన్నీ కేసీఆర్ ను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి.తెలంగాణలో కేసుల సంఖ్య పెరగడానికి కేసిఆర్ వైఫల్యమే కారణమని , మస్లిజ్ పార్టీ ఒత్తిడి మేరకే కరోనా కేసుల సంఖ్య ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని, టెస్ట్స్ చేసేందుకు కూడా వెనకడుగు వేసిందని, ఇప్పుడు టిఆర్ఎస్ నిందలు మోస్తోంది.

ముఖ్యంగా మర్క జ్ లింకులు బయటపడ్డాక హైదరాబాద్ లో భారీగా టెస్టులు చేయాల్సి ఉన్నా, కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని బిజెపి ఆరోపిస్తున్నా, దానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో టిఆర్ఎస్ ఉంది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండడం తో టిఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

మజ్లిస్ పార్టీ ఒత్తిడితోనే కేసిఆర్ టెస్ట్ లు ఎక్కువ సంఖ్యలో చేసేందుకు వెనకడుగు వేశారని, కేసుల సంఖ్య తక్కువ చేసి చూపించారని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వంటివారు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నా, దానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టిఆర్ఎస్ ఉంది.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం ఇప్పుడు ఊపు అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube