దేవుడా: ఒక్క నెలలోనే ఇన్ని లక్షల ఉద్యోగాలు పోయాయా...?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధానాన్ని పాటించిన సంగతి తెలిసిందే.

 God How Many Lakhs Of Jobs Were Lost In A Single Month  Coronavirus, Job, Cmie,-TeluguStop.com

లాక్ డౌన్ విధానం ద్వారా అనేక పరిశ్రమలలో అభివృద్ధి కుంటుపడింది.ఇక మన దేశ పరిస్థితికి వస్తే… ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న, అలాగే రికవరీ రేటు కూడా బాగా ఉందని భావిస్తున్న నేపథ్యంలో జూన్ నెలలోనే భారతదేశంలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయి.

ఇకపోతే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుండి ఏకంగా 18 మిలియన్ ఉద్యోగాలు భారతీయులు కోల్పోయారు.దీంతో జూన్ నెలలో 50 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిపారు.

ఈ సమాచారాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలియజేసింది.భారతదేశంలో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య ఇబ్బంది పెడుతుంటే, మళ్ళీ ఇలా ఉద్యోగాలు కోల్పోవడం పెద్ద సమస్యగా మారింది.

ఇక తాజాగా జూలై నెలలో మరో 5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.ఇకపోతే లాక్ డౌన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి జూలై నాటికి ఉద్యోగుల పరిస్థితి మరింత దిగజారింది.

మరోవైపు ఉద్యోగాలు ఉన్నవారు కూడా మానసిక ఒత్తిడిని, వేతనాల కోత కారణంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

ప్రస్తుత కాలంలో ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది.

ఇక ఉద్యోగం ఊడితే పరిస్థితి మరింత దిగజారుతుంది.ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా తక్కువ శాతం ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారు.

ఏది ఏమైనా కరోనా వైరస్ ఇటు ఉద్యోగులకు, అటు రోజువారి జీవితం గడిపే వారికి కూడా అనేక ఇబ్బందులను తీసుకువచ్చింది.కొంతమంది ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube