ఈ సమయంలోనూ మౌనమేలనోయి పవన్ ?

ఎన్నో అంచనాలు ఆశలతో ఆవిర్భవించడం, జనసేన పార్టీ ఎప్పటికీ రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నట్టు గా కనిపించడం లేదు.అప్పుడప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని పవన్ పదే పదే విమర్శలు ఎదుర్కొంటున్నారు.2014లో పార్టీ ఆవిర్భవించినా ఇప్పటి వరకు పవన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. 2014 ఎన్నికల్లో పవన్ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా, బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు పలికారు.అయితే 2019 ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగారు.కానీ ఒకే ఒక్క సీటు కు మాత్రమే పరిమితమై పోవడం, అది కూడా పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘోరంగా ఓటమి చెందడంతో జనసేన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందనే చెప్పాలి.

 Pawan Kalyan Silent In Ap Coronavirus Spreading Issue, Coronavirus, Ap, Ap Cm Ja-TeluguStop.com

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందినా పవన్ ఇంకా అనుమానాస్పదంగానే వ్యవహరిస్తుండడం , గత టీడీపీ ప్రభుత్వంలో విపక్షంలో ఉన్న వై సీ పీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించారు పవన్.

ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది.ఇప్పుడు కూడా పవన్ ఆ పార్టీపైనే విమర్శలు చేస్తూ టీడీపీ కనుసన్నల్లో పని చేసే వ్యక్తి గా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అది కూడా పవన్ ఏపీ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు గా కనిపించడం లేదు.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటానని, సినిమాల్లో నటించనని ఆర్భాటంగా ప్రకటించారు.

కానీ ఆ తర్వాత మాట తప్పుతూ సినిమాల్లో బిజీ అవ్వడం, పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేశారు.కేవలం అప్పుడప్పుడు ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పార్ట్ టైం పొలిటీషియన్ గా ముద్ర వేయించుకున్నారు.

Telugu Ap Cm Jagan, Ap Coronavirus, Chandrababu, Coronavirus, Janasena, Janasena

ఇక ఒంటరిగా పార్టీని ముందుకు నడిపించడం కష్టమనే భావనతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయంగా జనసేన ను బీజేపీ సహకారంతో బలోపేతం చేయాలని చూసినా, ఆ దిశగా ను పవన్ అడుగులు వేయలేకపోతున్నారు.ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఏపీలో కరోన విలయతాండవం చేస్తోంది. ఈ సమయంలో పార్టీ తరఫున యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం కరోనా విషయంలో ప్రశ్నించే అవకాశం ఉన్నారు.

పవన్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నరనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి.ఒక పక్క తెలుగుదేశం కరోనా విషయాన్ని రాజకీయంగా వినియోగించుకుంటూ, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా పార్టీ నాయకులు మరింత ఉత్సాహం తెచ్చే విధంగా ప్రయత్నిస్తుంటే, పవన్ మాత్రం మౌనంగా ఉండిపోవడం జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకునే లా చేస్తున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube