కరోనా దెబ్బ: నెక్స్ట్ ఇయర్ కూడా విద్యార్థులకు నో ఎగ్జామ్స్!  

Exams cancelled to 1st to 8th students in Andhra Pradesh, Coronavirus, Jagan Governament, 1 To 8 Th Exams, AP Education Branch, Online Class, - Telugu 1 To 8 Th Exams, Ap Ducation Branch, Coronavirus, Jagan Governament, Online Class

కరోనా వల్ల ఈ సంవత్సరం విద్యార్థులు అందరూ కూడా ఇళ్లకే పరిమితమైపోయారు.మార్చి,ఏప్రిల్ నెలల నుంచి కూడా స్కూల్స్ అన్ని బంద్ చేయడం తో ఇంటికే పరిమితమై ఆన్ లైన్ క్లాసులతో బిజీ బిజీ గా ఉంటున్నారు.

TeluguStop.com - Coronavirus Jagan Governament 1 To 8 Th Exams Ap Education Branch

ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కుస్తీ పోటీలు పడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తరువాత కూడా తమ పిల్లలు ఎలా ఈ సంవత్సరం గట్టెక్కుతారు అన్న అనుమానాలు కూడా పేరెంట్స్ లో మొదలైంది.

ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ ఇప్పుడు తీపి కబురు చెప్పింది.ఇప్పటికే సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి అని ప్రకటించగా దశల వారీగా నవంబర్ నాటికి సరైన జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు విద్యను అందించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

TeluguStop.com - కరోనా దెబ్బ: నెక్స్ట్ ఇయర్ కూడా విద్యార్థులకు నో ఎగ్జామ్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటికే మూడు నెలలు ఆలస్యం కావడం తో సిలబస్ తగ్గించేందుకు కూడా సిద్ధం అవ్వగా నిపుణుల బృందం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది.దీనితో దాదాపు 30 నుంచి 40 శాతం మేరకు సిలబస్ తగ్గించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయితే ఇప్పుడు తాజాగా ఒకటో తరగతి నుంచి 8 వ తరగతి విద్యార్థుల వరకు కూడా ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించనున్నట్లు తెలుస్తుంది.దీనితో ఇప్పటికే ఈ మహమ్మారి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను సైతం ప్రమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోగా, ఈ కరోనా కారణంగానే నెక్స్ట్ ఇయర్ కూడా 1 నుంచి 8 వ తరగతి విద్యార్థులను పై సంవత్సరానికి ప్రమోట్ చేయనున్నారు.

ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించినట్లు తెలుస్తుంది.వీరందరికీ కూడా ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్ లను ఇవ్వడం అనేది జరుగుతుంది.

అయితే 9,10 తరగతుల విద్యార్థులకు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు ఉంటాయని సమాచారం.

#Coronavirus #1 To 8 Th Exams #Online Class

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Jagan Governament 1 To 8 Th Exams Ap Education Branch Related Telugu News,Photos/Pics,Images..