కరోనా ధాటికి అమెరికాలో ఇద్దరు భారతీయులు మృతి..!!!

అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా కనికరం చూపించడం లేదు.రోజు రోజుకి కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి.

 Coronavirus, Indo Americans, Nris, Death, America-TeluguStop.com

ఇప్పటి వరకూ కరోనా కేసులు అమెరికా వ్యాప్తంగా చూస్తే 2 లక్షలు పైగా కేసులు నమోదు కావడం, 4, 700లకి పైగా మృతి చెందడం ఆ దేశ ప్రజలని కలవర పెడుతోంది.ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మృతుల సంఖ్య లక్షకి పైగా ఉండచ్చని నివేదికలు చెప్తున్నాయి.

ఇదిలాఉంటే.

అమెరికాలో కరోనా కారణంగా ఇద్దరు భారతీయ ఎన్నారైలు చనిపోవడంతో ఎన్నారైలలో గుబులు రేపుతోంది.

కొందరు ఎన్నారైలకి కరోనా సోకి వారు క్వారంటైన్ లో ఉంది చికిత్స పొందుతున్నారు.దాదాపు ఎన్నారైలు అందరూ ఇళ్లలోనే ఉంటూ భారతీయ సాంప్రదాయాల ప్రకారం కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.

అయితే తాజాగా అమెరికాలో భారత సంతతికి చెందిన ఇద్దరు ఎన్నారైలు కరోనా రక్కసికి ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది.

అమెరికాలోని న్యూయార్క్ లో కేరళ రాష్ట్రానికి చెందిన ధామస్ డేవిడ్ అనే 43 ఏళ్ళ వ్యక్తి కరోనా సోకి మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే న్యూజెర్సీ లో ఎర్నాకుళానికి చెందిన 85 ఏళ్ళ కుంజమ్మ శ్యాముల్ కరోనా వైరస్ సోకి మృతి చెందారు.చనిపోయిన ఇద్దరూ కూడా అమెరికాలో అత్యధికంగా కరోనా ప్రభలిన న్యూయార్క్, న్యూజెర్సీ లకి చెందిన వారు కావడం గమనార్హం.

అయితే ఇప్పటి వరకూ ఇటలీ ,స్పెయిన్ , ఇరాన్ దేశాలలో ఒక్కొక్కరు చప్పున మొత్తం ముగ్గురు భారతీయ ఎన్నారైలు చనిపోయారని అమెరికాలో చనిపోయిన ఇద్దరితో కలిపి మొత్తం 5 మంది ఎన్నారైలు కరోనా వైరస్ కి బలైపోయినట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube