కరోనా కేసుల్లో పైకి ఎగబాకుతున్న భారత్, 9 స్థానం లో....

భారత్ లో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా,భారత్ లో కూడా ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.

 World Wide India At Ninth Position In Corona Cases, America, Coronavirus, India-TeluguStop.com

దీనితో ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు మరో సంఖ్య ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరింది.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 59 లక్షలకు చేరగా,భారత్ లో కేసుల సంఖ్య లక్షా 65 వేలకు చేరినట్లు తెలుస్తుంది.

మొత్తం 59,00,907 కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు కాగా అందులో 25,77,250 మంది కోలుకోగా, 29,62,108 మంది వైరస్‌తో పోరాడుతున్నారు.అందులోనూ 53,975 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక.మొత్తం మరణాల సంఖ్య 3,61,549కి చేరింది.మరణాల సంఖ్య లో ఒక్క అమెరికాలోనే లక్ష మంది చనిపోగా, 17.6 లక్షల కేసులతో అమెరికా ఇప్పటివరకు కరోనా కేసుల విషయంలో కూడా అగ్రరాజ్యంగా టాప్ ప్లేస్‌లో ఉంది.అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఉన్నాయి.ఆ తరువాత 9వ స్థానంలో భారత్ ఉంది.ఇంతకుముందు పదో స్థానంలోఉన్న భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతుండడం తో మరో స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానం కి చేరింది.అటు.అమెరికాలో నిన్న ఒక్క రోజే 1223 మంది చనిపోయారు.బ్రెజిల్‌లో 1067 మంది మృతి చెందారు.

ఆ తర్వాత మెక్సికోలో 463, యూకేలో 377, ఇండియాలో 177, రష్యాలో 174, పెరూలో 116, కెనడాలో 112 మంది కరోనా రోగులు మరణించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube