కరోనా కంట్రోల్ అయ్యేది అప్పుడేనంటగా ?

కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతి ఒక్కరు ఈ ప్రభావానికి గురవుతున్నారు.

 In India One  Survey Of Method Says Coronavirus Control In September Month. Coro-TeluguStop.com

దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.వర్తక, వాణిజ్య, వ్యాపారాలు మూలనపడ్డాయి.

జనజీవితం అతలాకుతలమైంది.మార్చి 24 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మధ్యలో కొన్ని సడలింపులు ఇచ్చారు.

అయినా కేసుల సంఖ్య తగ్గకపోగా, మరింతగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశమే.కరోనా తో కలిసి జీవించాలని నాయకులు ఎప్పుడో సూచించారు.

జనాలు కూడా దానికి అలవాటు పడ్డారు.ఇక సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకుంటున్న సమయంలో మరింతగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Telugu Baileyrelative, Coronavirus, India, Indian, Lock, Maharastra-General-Telu

ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజులోనే 3007 కేసులు నమోదు అవ్వడం, ఇప్పటి వరకు అక్కడ 85 ,975 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటి వరకు సుమారు మూడు వేల మందికిపైగా మహారాష్ట్రలో కరోనా కారణంగా చనిపోయారు.రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కూడా దేశంలో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టు కనిపించడం లేదు.

దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అధ్యయనం చేస్తోంది.వారి అంచనా ప్రకారం సెప్టెంబర్ రెండవ వారం తర్వాత దేశంలో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆరోగ్యశాఖ చేసిన ఓ అధ్యయనంలో తేలింది.

ప్రస్తుతం కరోనా బారిన పడినవారు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య సమానమైనప్పుడే వైరస్ నుంచి పూర్తిగా విముక్తి అయినట్లు భావించాలని వారు చెబుతున్నారు.

Telugu Baileyrelative, Coronavirus, India, Indian, Lock, Maharastra-General-Telu

బెయిలీ రిలేటివ్ రిమూవల్ రేట్ మెథడాలజీ ప్రకారం మార్చి 1 నుంచి 19 వరకు కరోనా కేసుల గ్రాఫ్ పరిశీలించారు.పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్, రుపాలి రాయ్ ఇద్దరూ కలిసి దీనిపై అధ్యయనం చేశారు.ఈ అధ్యయనం ఎపిడెమియాలజీ ఇంటర్నేషనల్ లో పబ్లిష్ కూడా అయ్యింది.

బెయిలీ థియరీ ప్రకారం సెప్టెంబర్ మధ్య కాలం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.అయితే అప్పటికి కేసుల సంఖ్య ఎంత వరకు పెరుగుతుంది ? ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య మరింతగా పెరిగితే ఏం చేయాలనే దానిపైన ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube