సెప్టెంబర్ లో తీవ్ర స్థాయి... డిసెంబర్ కు తగ్గుముఖం, తాజా నివేదిక

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా కోరలు చాపుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే రోజుకు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండగా సెప్టెంబర్ నాటికి ఈ మహమ్మారి మరింత గరిష్ఠానికి చేరుకుంటుంది అని ఇండియా ఔట్ బ్రేక్ ఒక నివేదిక విడుదల చేసింది.

 Corona Will Reduce In December Month India Outbreak New Report, Coronavirus, Ind-TeluguStop.com

ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు దాటగా సెప్టెంబర్ లో మరింత గరిష్ఠానికి చేరుకుంటుంది అన్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.అయితే మరో సంతోషకర విషయం ఏమిటంటే డిసెంబర్ నాటికి భారత్ లో ఈ వైరస్ తిరోగమన దశలో ఉంటుంది అంటూ ఆ నివేదికలో వెల్లడించింది.

సెప్టెంబర్ తొలివారానికి కేసుల పెరుగుదల గరిష్ణానికి చేరుతుందని అంచనా వేసింది.సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో వైరస్ తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఆ తరువాత మరో 15 రోజులకు హాట్‌స్పాట్స్‌లోనూ తగ్గుముఖం ప్రారంభమవుతుందని ఆ నివేదికలో పేర్కొంది.

తొలినాళ్లలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో, ఐఓఆర్ తాజా నివేదిక తో ప్రజల్లో ఆశలను పెంచుతున్నాయి.అలానే దేశంలో రాష్ట్రాల వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడతాయి అన్న దానిపై కూడా ఐ ఓ ఆర్ తన నివేదికలో వెల్లడించింది.

వైరస్ ఎదుర్కునే శక్తి భారతీయుల్లో పెరుగుతోందని, నవంబర్ నాటికి ముంబయి కరోనా నుంచి బయట పడవచ్చని, అక్టోబర్ చివరి నుంచి చెన్నైలో వ్యాధి తగ్గుముఖం పడుతుందని, అలానే బెంగుళూరు లో కూడా ఆగస్టు నెలాఖరుకు గరిష్టానికి చేరుకొని, ఆ తరువాత నవంబర్ రెండో వారం తరువాత తగ్గు ముఖం పడతాయి అంటూ ఈ తాజా నివేదిక వివరించింది.మొత్తానికి ఏది ఎలా ఉన్నా డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ వైరస్ అనేది తగ్గుముఖం పడుతుంది అంటూ ఐ ఓ ఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube