చైనా దెబ్బకు భారత్ ఇలా లాభపడబోతోందిగా?

ప్రపంచమంతా కరోనా ప్రభావానికి విలవిల్లాడుతున్నాయి. ఎప్పుడు ఏ విధంగా పరిస్థితులు మారతాయో తెలియకుండా ఉంది.

 So Many Other Countries Are Invested In India, Coronavirus, India Lockdown, Amer-TeluguStop.com

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ కరోనా కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.మరికొన్ని దేశాల్లో మరణాల శాతం పెరిగి పోతూ ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇక అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి.ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండడం, అదే స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, పౌరులు ఆకలి బాధతో విలవిల్లాడుతూ ఉండడం, ఇక్కడ చోటుచేసుకుంటున్నాయి.

దీంతో అసలు కారణం చైనా అంటూ అమెరికా తీవ్రస్థాయిలో ఆదేశంపై మండిపడుతోంది.

Telugu Financial, America, America Trump, Chaina, Coronavirus, Donald Trump, Ind

ప్రపంచ దేశాల అభిప్రాయం కూడా ఇదే విధంగా ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిత్యం చైనా మీద ఆరోపణలు చేస్తునే ఉన్నారు.ఇంతటి విధ్వంసానికి కారణం చైనానే కారణం అంటూ అమెరికా తీవ్రంగా మండిపడుతోంది.

ముందుగానే చైనా దీనిని గుర్తించినా, వైరస్ విషయాన్ని దాచి పెట్టి ప్రపంచ దేశాలకు ఇది విస్తరించడానికి కారణమైందని మండిపడుతోంది.ఇదేవిధంగా జపాన్ వంటి దేశాలు కూడా చైనా పై ఆగ్రహంగానే ఉన్నాయి.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చైనా ల్యాబ్ నుంచి వైరస్ బయటకు రాలేదని, కేవలం జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందిందని చెబుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

Telugu Financial, America, America Trump, Chaina, Coronavirus, Donald Trump, Ind

ఈ సంగతి ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పుడు చైనా ను కట్టడి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాయి.జర్మనీ వంటి దేశాలు నష్టపరిహారం కోరుతూ చైనాకు నోటీసులు కూడా ఇచ్చింది.ఇక మరికొన్ని దేశాలు చైనా లో ఉన్న తమ పరిశ్రమలను తరలించేందుకు సిద్ధమవుతున్నాయి.

దక్షిణ కొరియా, అమెరికా జపాన్ వంటి దేశాలు తమ పరిశ్రమలను చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే చైనా నుంచి తరలించే తమ సంస్థలను భారత్ లో స్థాపించేందుకు అన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి.

ఈ మేరకు భారత ప్రభుత్వంతో కూడా చర్చలు ప్రారంభించాయి.ముఖ్యంగా దక్షిణ కొరియా చైనా లో ఉన్న తమ కంపెనీలు భారతదేశానికి తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Telugu Financial, America, America Trump, Chaina, Coronavirus, Donald Trump, Ind

ఈ అవకాశాలను భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.దీని ద్వారా ఆర్థికంగా భారత్ కు బాగా కలిసి వస్తుందని, భవిష్యత్తులోనూ మరికొన్ని సంస్థలు భారత్ లో తమ పరిశ్రమలలో స్థాపించేందుకు సిద్దమవుతుండటంతో భారత ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు చేకూరుతుందని అభిప్రాయం ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత విదేశీ కంపెనీలు చాలావరకు భారత్ కు క్యూ కట్టేందుకు అవకాశం కనిపిస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube