ఈ వైరస్ ఇప్పటిది కాదట,ఎప్పుడో పదేళ్ల క్రితమే...

కరోనా వైరస్

దేశవ్యాప్తంగా ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటుందో అందరికి తెలిసిందే.అయితే ప్రపంచ దేశాల్లో చాలా వేగంగా వ్యాపించడం పై కొంతమంది శాస్త్రవేత్తల బృందానికి కొత్త డౌట్ ఒక వచ్చింది.ఈ వైరస్ అందరూ అనుకుంటున్నట్లుగా కొత్తగా వ్యాపించింది కాదని,ఇదో దాదాపు పదేళ్ల కిందటే వ్యాపించి ఉంటుంది అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.2019 నవంబర్ లేదా డిసెంబర్‌లో మనుషులకు ఈ వైరస్ వ్యాపించలేదనీ… దాదాపు పదేళ్ల కిందటే అది వ్యాపించి ఉంటుందని తమ అధ్యయన వివరాల్ని జర్నల్ నేచర్ మెడిసిన్‌లో శాస్త్రవేత్తల బృందం రాసిపెట్టింది.అయితే తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉంటుందని అంచనా వేసింది.ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా సైంటిస్టులు ఉన్నారు.
మార్చి 17న తమ పరిశోధన వివరాల్ని వెల్లడించగా దానిలో ఈ వివరాలను వెల్లడించినట్లు తెలుస్తుంది.అయితే పదేళ్ల క్రితం వచ్చిన ఈ వైరస్ వల్ల అప్పుడే ఎందుకు ఎవరూ చనిపోలేదు,ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారు అన్న నుమానం రాకమానదు.

 Evolution And Mutation, Coronavirus, Evoluation, Years Of Study, Covid19-TeluguStop.com

అయితే దానికి కూడా శాస్త్రవేత్తలు ఒక సమాధానం ఇచ్చారు.కొన్నేళ్ల కిందటే మనషుల్లోకి ఎంటరైన ఈ వైరస్… క్రమక్రమంగా తనలో

జన్యుపరమైన మార్పులు

(Evolution and Mutation) చేసుకుంటూ ఉండి ఉండొచ్చని అంటున్నారు.

మొదట్లో బలహీనంగా ఉన్న ఈ వైరస్… సంవత్సరాల తరబడి బలం పెంచుకుంటూ… మనుషుల నుంచి మనుషులకు వ్యాపించేంత బలం ఇప్పుడు సంపాదించుకొని ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకూ కరోనా వైరస్ జన్యువుల్ని గమనిస్తే… అది సహజ సిద్ధంగానే వచ్చింది తప్ప ఏ అంతరిక్షం నుంచో జారి పడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Telugu Coronavirus, Covid-Latest News - Telugu

ఓ శాస్త్రవేత్త మరో ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు.అందరూ అనుకుంటున్నట్లు ఈ వైరస్… మొదట చైనాలోని వుహాన్‌లో రాలేదనీ అంతకంటే ముందే ఇటలీలో అత్యధిక కేసులు నమోదైన లాంబార్డీలో వచ్చి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 37 వేల మంది మృతి చెందగా,7 లక్షలకు పైగా ఈ కరోనా భారిన పడడం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube