అక్కడ మాస్క్ ధరించకుంటే భారీ గా ఫైన్,రేపటి నుంచే అమలు

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ దేశంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో రోజుకు 1000,1500 కేసులు మాత్రమే నమోదు అవుతున్న భారత్ లో ఇప్పుడు ఈ సంఖ్య 60 వేలకు పైగా నమోదు అవుతుండడం గమనార్హం.

 Gujarat Government Increased Fine For Not Wearing A Mask In Public Area,  Corona-TeluguStop.com

దేశవ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.దీనితో కొన్ని కొన్ని రాష్ట్రాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకొనే చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలోనే గుజరాత్ సర్కార్ మాస్క్ ధరించని వారికి భారీ జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంది.కరోనా నిబంధ‌న‌లు పాటించ‌డంలో ప‌లువురు గుజ‌రాత్ ప్రజలు అశ్ర‌ద్ధ చేస్తున్నారు.

త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధరించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని అధికారులు ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ ఆ సూచనలను ఎవరూ పాటించడం లేదు.దీనితో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్ప‌టివ‌ర‌కు మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ.200గా ఉన్న ఫైన్‌ను ఇక నుంచి ఏకంగా రూ.1000కి పెంచుతూ గుజరాత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా ఈ పెంపు ఆగ‌స్టు 11 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ స్వయంగా వెల్ల‌డించారు.

గుజరాత్ సర్కార్ ఈ మహమ్మారి నేపథ్యంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.

ఇప్పటి వరకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలకు పైగా ఉండగా, మరణాల సంఖ్య 2,600 వందలకు పైగా ఉంది.

దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ముందుగా మహారాష్ట్ర,తమిళనాడు,కేరళ,ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలకు పైగా నమోదు అవుతున్నాయి.

అలానే గడచిన 24 గంటల్లో రికార్ట్ స్థాయిలో వెయ్యి మందికి పైగా కరోనా రోగులు మృతి చెందడం మరింత కలవరం కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube