ఉద్యోగికి కరోనా,గోవిందరాజస్వామి ఆలయం మూసివేత !

గత కొంత కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించేస్తున్న నేపథ్యంలో భారత్ లో కూడా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు పరిచిన విషయం తెలిసిందే.దీనితో ఆలయాలు సైతం మూసివేయడం తో భక్తులు దర్శనం చేసుకోవడానికి ఆలయాలు కూడా లేక నా నా ఇబ్బందులు పడ్డారు.

 Tirupati Govindarajaswamy Temple Closed-TeluguStop.com

అయితే ఇటీవల లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో ఆలయాలు తీర్చుకోవడానికి కేంద్రం అంగీకరించడం తో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారాలు సైతం సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు తెరుచుకున్నాయి.అయితే తిరుపతి లో శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో విధులు నిర్వహించే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం పెద్ద కలకలం సృష్టించింది.

సుదీర్ఘ విరామం తరువాత దేవుడిని దర్శించుకోవాలి అని అనుకున్న భక్తులకు ఇలాంటి చేదు వార్త తెలిసింది.అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి పాజిటివ్ రావడం తో రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేయాలి అని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తుంది.

నేడు, రేపు 2 రోజుల పాటు ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసిన త‌రువాత ఆదివారం నుండి య‌థావిధిగా ఆల‌యాన్ని తెరుస్తామని అక్కడి అధికారులు తెలిపారు.అంతకుముందు గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి… ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా రెగ్యూలర్ చెకప్‌కు వెళ్లారు.

అయితే ఆయనకు కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలింది.అయితే ఆ ఉద్యోగి ఇంతక ముందు పాత హుజుర్ ఆఫీస్‌, పిహెచ్ స్టోర్‌ లో సంచరించినట్లు తెలియడం తో వాటిని కూడా రెండు రోజులు మూసివేసి శానిటైజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

అలానే ఇక ఆయనను కలిసిన వారందరిని కూడా వెతికి కనిపెట్టి వారందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube