అనారోగ్యం తో ఉన్న వ్యక్తిని దారుణంగా చెత్త రిక్షా లో...

కరోనా మహమ్మారి కారణంగా చాలా మందిలో మానవత్వం చచ్చిపోయింది అని చెప్పాలి.ఈ మహమ్మారి కి భయపడి ఒకరినొకరు చూసుకోవడానికి సైతం మానేస్తున్నారు.

 Corona Suspected Person Shifted To Hospital In Garbage Rickshaw In West Godavari-TeluguStop.com

అంతలా జనాలను హడలెత్తిస్తున్న ఈ మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా కేసులు మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

వైరస్ వచ్చిన వారి పట్ల ఎలా ఉండాలో అన్న దానిపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొందరిలో ఎలాంటి మార్పు మాత్రం రావడం లేదు.ఈ మహమ్మారికి భయపడి అనుమానితులకు సైతం సాయం అందించడానికి కూడా జనాలు వణికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో కూడా ఇలాంటి అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఒక వ్యక్తిని చెత్త బండిలో ఆస్పత్రిలో తరలించి ఘటన అందరినీ కలచి వేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా లోని ఐ.భీమవరం గ్రామంలోని బస్టాండ్ లో ఒక వ్యక్తి 2 రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నాడు.జ్వరం,జలుబు ఉండడం తో కరోనా ఉందేమోఅన్న అనుమానం తో భయపడిన స్థానికులు అతడు అక్కడే ఉంటె ప్రమాదకరమని భావించి 108 కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించారు.అయితే 108 కు ఎన్నిసార్లు కాల్ చేసినా అంబులెన్స్ రాకపోవడం తో కనీసం ఆటోలో అయినా అతడిని తీసుకెళ్లడానికి ఎవరూ సాహసించలేదు.

దీనితో ఏమి చేయాలో అర్ధం కాకా చివరకు మానవత్వం కూడా పక్కన పెట్టి గ్రామ సిబ్బంది చెత్తను తరలించే రిక్షా లో ఆ వ్యక్తిని ఆకివీడు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కరోనా సోకింది అన్న అనుమానంతో వారు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది.మరోపక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిపోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 96 వేలమంది కి పైగా కరోనా కేసులు నమోదు కాగా, 9 వందలకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube