కరోనా బాసూ ఏం చేస్తాం: దేశానికే అధినేత షేక్‌హ్యాండ్ ఇస్తే... పక్కకు జరిగిన మంత్రి

కరోనా ధాటికి ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే.చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ప్రస్తుతం 66 దేశాలకు విస్తరించింది.

 Coronavirus Fears German Chancellor Angela Merkels Handshake Refused By Interio-TeluguStop.com

దీని బారిన పడి ఇప్పటి వరకు 3,000 మంది మరణించగా, 88 వేల మంది ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు.భారతదేశంలోనూ 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇక్కడా ఆందోళన మొదలైంది.

కేవలం పరిశుభ్రత, ముందస్తు నివారణా చర్యలు తప్పించి, చికిత్స లేని కరోనాకు సామాన్యులతో పాటు దేశాధినేతలు కూడా భయపడిపోతున్నారు.ఇప్పటికే ఇరాన్ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు కరోనా సోకడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

అదే సమయంలో ఇతరుల కళ్లు, నోరు, ముక్కు, చేతులను తాకకుండా వీలైనంత దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రముఖలు సైతం దానిని ఫాలో అవుతున్నారు.ఇదే సమయంలో దేశాధినేతలు షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే కరోనా భయంతో పక్కకు జరుగుతున్నారు.

జర్మనీలో ఇదే జరిగింది.

Telugu Angela Merkel, Coronavirus, Interior, Telugu Nri-Telugu NRI

ఆ దేశ రాజధాని బెర్లిన్‌ ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.దీనిలో హాజరయ్యేందుకు జర్మనీ అధినేత ఏంజెలా మెర్కెల్ రావడంతో అక్కడున్న వారంతా లేచి నిలబడ్డారు.ఆ సమయంలో కూర్చిలో కూర్చొన్న ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి హోర్ట్స్ సీహోవర్‌కు మెర్కెల్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాచారు.

అయితే కరోనా భయంతో ఆయన చేతిని ఆమెకు ఇవ్వకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.మొదట హోర్ట్స్ తీరుకు మెర్కెల్ ఆశ్చర్యపోయినప్పటికీ ఆ తర్వాత విషయం అర్ధం చేసుకుని ఆమె కూడా నవ్వారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube