రెస్టారెంట్స్‌కు వెళ్తున్నారా.. ఇది తెలిస్తే అటు వైపు కూడా చూడ‌రు!

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ గ‌త ఎనిమిది నెల‌లుగా ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లను, ప్ర‌భుత్వాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా వైర‌స్ ధాటికి ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

 Coronavirus Effect On Restaurants! Coronavirus, Restaurants, Latest News, Covid--TeluguStop.com

ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఊహించ‌ని రీతిలో న‌మోద‌వుతున్నాయి.

భార‌త్‌లో సైతం క‌రోనా వైర‌స్ అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తోంది.ఇప్ప‌టికే భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48 ల‌క్ష‌లు దాటేసింది.ఇదిలా ఉంటే.అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక‌ అన్ని వ్యాపారాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి.

ప్ర‌జ‌లు సైతం మ‌ళ్లీ పాత జీవితాన్ని గ‌డిపేందుకు అల‌వాటు ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలోనే చాలా మంది రెస్టారెంట్ల లో ఎంజాయ్ చేస్తుంటారు.

ముఖ్యంగా యువ‌త రెస్టారెంట్ల‌లో తినేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.అయితే రెస్టారెంట్ల కు వెళ్లని వాళ్లతో పోల్చుకుంటే.రెస్టారెంట్లకు వెళ్లిన వారికి ప్రాణాంత‌క కరోనా వైర‌స్‌ సోకే రిస్క్‌ ఎక్కువగా ఉంద‌ని తాజాగా ఓ స‌ర్వే తేల్చి చెప్పింది.ఇంట్లో తినే వాళ్లకంటే.

రెస్టారెంట్ కు వెళ్లి తినే వారే రెట్టింపు సంఖ్యలో క‌రోనా బారిన‌ప‌డుతున్నారు‌.ఈ మేర‌కు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డీసీసీ కంట్రోల్ అండ్ ప్రెవెన్సన్(సీడీసీ) వెల్ల‌డించింది.

సాధార‌ణంగా రెస్టారెంట్స్‌లో వంట‌లు చేసే వారు, వ‌డ్డించే వారు మాస్క్‌లు ధ‌రించ‌వ‌చ్చు లేదా ధ‌రించ‌క‌పోవ‌చ్చు.

ఒక‌వేళ వీరికి క‌రోనా ఉంటే.

వ‌చ్చే క‌స్ట‌మ‌ర్లు రిస్క్‌లో ప‌డిన‌ట్టే.ఇక తినే స‌మ‌యంలో ఖ‌‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ తీయాల్సిందే.

అలాగే రెస్టారెంట్స్ లో భౌతికదూరం పాటించడం కూడా చాలా క‌ష్టం.కాబ‌ట్టి, ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఎక్కువ‌ని అంటున్నారు నిపుణులు.

అందుకే క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ రెస్టారెంట్స్ భోజ‌నం చేసే అల‌వాటును త‌గ్గించుకుంటే మంచిదంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube