కరోనా పరిస్థితుల కారణంగా దేశంలో పలు పరీక్షలను రద్దు చేయడం జరిగింది.అయితే డిగ్రీ పరీక్షల విషయంలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే దిల్లీ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాదికి గాను డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయడం జరిగింది.ఇదే దారిలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా డిగ్రీ పరీక్షల రద్దు విషయమై చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
డిగ్రీ పరీక్షల రద్దు విషయమై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.ఈ పిటీషన్‌లో యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం విచారణ ప్రారంభించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా డిగ్రీ పరీక్షల రద్దు కాని మరే నిర్ణయం కాని యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ మాత్రమే తీసుకోవాలి.ఎవరికి వారు తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయంటూ రాష్ట్రాల యూనివర్శిటీలకు హెచ్చరికలు జారీ చేసింది.
డిగ్రీ పరీక్షలకు సంబంధించిన రద్దు విషయాన్ని మేము సీరియస్‌గా తీసుకున్నాం.విద్యార్థులకు నష్టం కలుగకుండా మరేదైనా మార్గం ఆలోచన చేయాల్సి ఉంది.
అంతే తప్ప పరీక్షలు రద్దు చేసి అందరిని పాస్ చేయడం అనేది ఖచ్చితంగా మేము హర్షించము అంటూ యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ కోర్టుకు తెలియజేసింది.దాంతో ఈ కేసు తుది తీర్పును ఈ నెల 14కు వాయిదా వేయడం జరిగింది.
పరిస్థితి చూస్తుంటే డిగ్రీ పరీక్షలు రద్దు అయ్యే అవకాశం లేదనిపిస్తుంది.