17 కు చేరిన కరోనా మృతుల సంఖ్య, ఆందోళనలో అధ్యక్షుడు

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతుంది.ఈ కరోనా ప్రభావం అగ్రరాజ్యం అమెరికా లో కూడా తీవ్ర స్థాయిలో విస్తరించింది.

 Coronavirus Death Cases 17-TeluguStop.com

ఈ కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 కు చేరగా,330 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.మరోపక్క దేశంలో ప్రబలుతున్న ఈ కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసరంగా 8.3 బిలియన్ డాలర్ల వ్యయానికి ఉద్దేశించిన ప్యాకేజి పై సంతకం కుడా చేసారు.అంతేకాకుండా ఈ కరోనా దేశంలో ప్రబలకుండా కరోనా నియంత్రణ బాధ్యతను అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కి అప్పగించిన సంగతి తెలిసిందే.

దీంతో పెన్స్.వివిధ దేశాల ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా.కరోనాకు గురై మృతి చెందినవారి సంఖ్య 3,450 కి పెరగగా 92 దేశాల్లో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య కూడా లక్షకు పెరగడం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అటు -న్యూయార్క్ సిటీలో కొత్తగా 22 కేసులు నమోదు కాగా.మొత్తం ఈ సంఖ్య 44 కి పెరిగింది.

మరోవైపు- ఇజ్రాయెల్ అనుకూల లాబీ వాషింగ్టన్ లో నిర్వహించిన సభకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర ఎంపీలు హాజరయ్యారు.

న్యూయార్క్ లో కరోనాకు గురైన ఓ జంట కూడా ఈ కాన్ఫరెన్స్ కు వఛ్చినట్టు తెలియడంతో అంతా ‘అలర్ట్’ అయ్యారు.

టెస్టుల్లో ఈ జంటకు కరోనా వైరస్ లక్షణాలు పాజిటివ్ అని వెల్లడైందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ.ఈ-మెయిల్ ద్వారా ఈ సభకు హాజరైనవారందరికీ తెలిపింది.దీనితో అందరూ ఆందోళన చెందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube