మౌత్ వాష్ తో అరనిమిషంలో కరోనా వైరస్ హతం..!

తాజాగా జరిగిన పరిశోధనలో కరోనా వైరస్ కేవలం 30 సెకన్లలో మౌత్ వాష్ లు హతమార్చగలవని తేలింది.కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా వైరస్ పై మనకు అందుబాటులో దొరికే మౌత్ వాష్ లు బాగా పని చేయగలరని వారి పరిశోధనలో తేలింది.

 Coronavirus, Covid19, Mouth Wash, Scientist Testing, Corona Viraus, Covid19, Mou-TeluguStop.com

ప్రజల రోజువారీ జీవన విధానంలో మౌత్ వాష్ లో ప్రధాన పాత్ర పోషించేందుకు వారి అధ్యాయం బాటలు వేస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు తెలిపారు.లాలాజలంలోని వైరస్ ను మౌత్ వాష్ లు చంపగలవు అని వారు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న కొవిడ్ పై చికిత్సలో వీటిని వాడలేక పోవడానికి కారణం శ్వాసనాలలో, అలాగే ఊపిరితిత్తుల్లోకి దీన్ని పంపించడానికి కుదరదని వారు తెలుపుతున్నారు.

Telugu Coronavirus, Covid, Mouth Wash, Scientist-General-Telugu

అలాగే వారు చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్ లో సిపిఎస్ ఆధారిత మౌత్ వాష్ పనిచేస్తున్నాయని సంపూర్ణంగా తెలిస్తే కేవలం చేతులు శుభ్రం చేసుకోవడం మాస్క్ పెట్టుకోవడం సామాజిక దూరం తోపాటు మౌత్ వాష్ లు కూడా వారి దైనందిక జీవితంలో ఓ భాగమైపోయింది అని వారు తెలుపుతున్నారు.కొన్ని రకాల మౌత్ వాష్ లను ల్యాబ్ లో ప్రయోగించడం ద్వారా వైరస్ మరణించిందని వారు చెబుతున్నారు. కరోనా వైరస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేట్లు వారు తెలియజేశారు.

శరీరంలో వైరస్ స్థాయిలను తగ్గించడానికి సీపీసీ ఆధారిత మౌత్ వాష్ లు బాగా పని చేయగలవని వారు పేర్కొంటున్నారు.పంటి చిగుళ్ల వ్యాధి కోసం తయారు చేసుకున్న కొన్ని మౌత్ వాష్ లు కరోనా వైరస్ నిర్ములన చేయగలవని తాజా అధ్యయనాలు వెల్లడవుతున్నాయి.

అయితే ఈ పరిశోధన సంబంధించి ఇంకా ఎక్కడ పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదు.కేవలం సాధారణ పరిస్థితుల నేపథ్యంలో భాగంగా ఈ వివరాలు బయటకు వచ్చాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రచురణకోసం జర్నల్ పంపిస్తామని ఆ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సూచిస్తున్నది ప్రజలకు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అనుసరించాలని ఆ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube