త్వ‌ర‌లో రోజుకు 4 లక్షల నుండి 8 లక్షల ఒమిక్రాన్ కేసులు... ప్రొఫెసర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.ఈ నెలాఖరు నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి.

 Coronavirus Cases In Ndia Will 4-to 8-lakh In A Day, 4-to 8-lakh, Omeicran , Cor-TeluguStop.com

ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ మహేంద్ర అగర్వాల్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ, కేసులు గరిష్టానికి చేరే సమయంలో దేశంలో ప్రతిరోజూ 4 నుండి 8 లక్షల కేసులు నమోదుకానున్నాయని చెప్పారు.కఠినమైన ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య‌ కొంతమేర‌కు త‌గ్గిన‌ప్ప‌టికీ, త‌రువాత తిరిగి కేసులు విజృంభిస్తున్నాయ‌న్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి చాలా కాలం పాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నార‌న్నారు.లాక్‌డౌన్ వంటి ఆంక్షలతో కూడా కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ ఆగదని ఈ అంచనాను బట్టి స్పష్టమవుతున్న‌ద‌న్నారు.

ఈ నెల మధ్య నాటికి, ముంబై, ఢిల్లీల‌లో కరోనా కేసుల స్థాయి గరిష్టానికి చేరుకుంటుంద‌ని ప్రొఫెసర్ తెలిపారు.ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చింద‌న్నారు.

ముంబై, ఢిల్లీ నగరాల్లో త్వ‌ర‌లో ప్రతిరోజూ 30 నుండి 50 వేల కొత్త కేసులు రానున్నాయ‌ని ఆయన చెప్పారు.ఈ నెలాఖరు నాటికే దేశంలో కరోనా థ‌ర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందన్నారు.

అంతకుముందు ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే కూడా జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ఈసారి బాధితులు ఎక్కువగా ఆసుపత్రుల‌కు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నామ‌ని నిపుణులు చెబుతున్నారు.గ‌తంలో మాదిరిగా పడకలు, ఆక్సిజన్ సంక్షోభం ఉండబోద‌న్నారు.జనవరి నెలాఖరు నాటికి దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతాయని ఆయన అన్నారు.

మార్చి నుండి కేసుల సంఖ్య‌ త‌గ్గుతుందన్నారు.

Covid Cases Rapid Increase in Next Week

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube