ప్రపంచదేశాల ప్రజలను ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా మహమ్మారి ముప్ప తిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే.అతిసూక్ష్మజీవి అయినప్పటికీ ఐదడుగుల మనిషిని హరిస్తుంది ఈ కరోనా.
ఈ రక్కసిని అంతం చేసే సరైన వ్యాక్సిన్ ఇంతవరకు అందుబాటులో రాకపోవడంతో.రోజురోజుకు పాజిటివ్ కేసులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.ఏ వస్తువుపై కరోనా ఎంతకాలం బతికి ఉంటుందనే విషయంపై ఇప్పటికే యానిసెఫ్ ఓ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కరోనా గురించి మరో షాకింగ్ విషయం బయటపడింది.కరోనా వైరస్ కళ్లద్దాలపై ఎంతకాలం ఉంటుందనే విషయంపై నిపుణులు మాట్లాడుతూ.
కళ్లద్దాలపై కరోనా వైరస్ ఏకంగా 9 రోజుల పాటు ఉంటుందని వెల్లడించారు.
అందుకే కళ్లద్దాలు ఉపయోగించే వారు.చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా బయటకు వెళ్లి వచ్చినప్పుడు వాటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు.
లేదంటే కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.అయితే కళ్లద్దాలను శుభ్రం చేసేందుకు ఆల్కహాల్ శానిటైజర్లు మాత్రం యూజ్ చేయవద్దని.
హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ చేస్తే మంచిదని అంటున్నారు.సో.బీ కేర్ఫుల్!
.