ఆ వ్యాక్సిన్‌‌ కరోనా మరణాలు తగ్గిస్తుందట!

కరోనా వైరస్.ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి 24 లక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది.

ఇంకా అందులో ఏకంగా ఐదు లక్షలమందికిపైగా కరోనాకు బలయ్యారు.ఇంకా 72 లక్షలమంది కరోనా నుండి కోలుకున్నారు.

అయితే కరోనా వైరస్ మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి టీబీ వ్యాక్సిన్‌‌ కీలక పాత్ర పోషిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పరిశీలన చేస్తే బీసీజీ వ్యాక్సినేషన్‌‌ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు అతి తక్కువగా ఉంది అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

ఇంకా అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో ఇది తేలింది.

అయితే అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్‌లోని పెర్నాంబుకో, రియోడి జనీరో, సావో పాలో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు తక్కువగా ఉందట.

దీనికి కారణం బీసీజీ వ్యాక్సిన్ అని తెలిపారు.కాగా బీసీజీ ఒక ప్రాంతంలో 10% కవరేజ్‌ ఉంటే కొవిడ్‌ మరణాల్లో అక్కడ 10% తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పత్తి పంటను కత్తెర పురుగుల బెడద నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!