వైరల్: అదరగొడుతున్న కరోనాపై చౌరస్తా బ్యాండ్ సాంగ్

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు మొరపెట్టుకుంటున్నాయి.ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

 Corona Virus Awareness Song By Chowraasta Band Goes Viral-TeluguStop.com

కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వస్తుండటంతో ఖాకీలు లాఠీలకు పని చెబుతున్నారు.

ప్రభుత్వం, అధికారులు, వైద్యులు, సినీ ప్రముఖులు తదితరులు అందరూ కూడా ప్రజలెవరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సూచనలు, సలహాలు, అవగాహన కల్పించే వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

అయితే తెలుగులో పాపులర్ మ్యూజిక్ బ్యాండ్‌గా పేరుతెచ్చుకున్న చౌరస్తా బ్యాండ్ తాజాగా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు, ప్రజల్లో అవగాహన కలిగించేలా ఓ పాటను రిలీజ్ చేశారు.‘చేయి చేయి కలపకురా.

’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను ఊపేస్తుంది.

ఈ పాటను రామ్ మిరియాల రచించగా చౌరస్తా బ్యాండ్ దీనికి సంగీతం అందించి, స్వరపరిచారు.

ఏది ఏమైనా ఇంట్లోనే ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని ఈ పాటలో వారు కోరారు.ఈ పాటలోని కొన్ని పదాలు, ముఖ్యంగా ‘‘ఉన్న కాడే ఉండరా, గంజి తాగి పండరా, మంచి రోజులొచ్చేదాక నిమ్మలంగా ఉండరా.

’’ బాగా నచ్చడంతో ప్రజలు ఈ పాటను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.దీంతో ఈ పాట ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube