అవపాన వాయువుల వల్ల కూడా కరోనా వ్యాప్తి

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతగా వణికించేస్తుందో అందరికి తెలిసిందే.ఇప్పటివరకు తుమ్మినా,దగ్గినా ఈ వైరస్ వ్యాపిస్తుంది అని అందుకే భౌతిక దూరం పాటించడం అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

 Can Carona Spread Through Farts, Coronavirus, Australian Doctors, Carona Spread-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం అవపాన వాయువులు(అనగా పిత్తుల)వలన కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందట.ఇప్పటివరకు కరోనా బారిన పడిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడితేనో.

లేకపోతే ఆ తుంపర్లు పడిన చోట మరో వ్యక్తి తాకితేనో వైరస్ సోకుతుందని భావించారు.అయితే శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం ఇలా అవపాన వాయువుల వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది అని అందుకే ఆ సమయంలో కూడా భౌతిక దూరం పాటించడం ముఖ్యం అని అంటున్నారు.

వినడానికి కొంచం విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం నిజం అంటున్నారు నిపుణులు.దగ్గులోనే కాకుండా శరీరం నుంచి బయటకి వచ్చే గ్యాస్ నుంచి కూడా కరోనా సోకుతుందని.

అందుకే బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్‌ను వదలకండి అంటూ ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్‌ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దుస్తులు లేనప్పుడు గ్యాస్ వదలడం వలన వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు.

అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ పిత్తకూడదని సూచించారు.పిత్తెటప్పుడు భౌతిక దూరం తప్పకుండా పాటించాలని తెలిపారు. బట్టలు వేసుకునప్పుడు పిత్తుల ద్వారా వైరస్ సోకడానికి తక్కువ అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. మరి మామూలుగా తుమ్మే వారిని అయితే కర్చీఫ్ అడ్డుపెట్టుకోమని చెప్పొచ్చు.

కానీ గ్యాస్‌ వదిలే వారికి ఏమని చెప్పాలో ఏమో మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube